Consumer Forum: డిస్కౌంట్ పేరుతో మోసం.. షాపింగ్ మాల్‌కు జరిమానా

భారీ ఢిస్కౌంట్ అంటూ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి షాపింగ్ మాల్స్. తీరా అక్కడికి వెళ్లాక కండీషన్స్ పేరుతో ఏవో మెలిక పెడుతుంటాయి. దీంతో చాలా మంది వినియోగదారులు మోసపోతుంటారు.

Consumer Forum: డిస్కౌంట్ పేరుతో మోసం.. షాపింగ్ మాల్‌కు జరిమానా

Consumer Forum

Updated On : June 6, 2022 / 8:29 AM IST

Consumer Forum: భారీ ఢిస్కౌంట్ అంటూ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి షాపింగ్ మాల్స్. తీరా అక్కడికి వెళ్లాక కండీషన్స్ పేరుతో ఏవో మెలిక పెడుతుంటాయి. దీంతో చాలా మంది వినియోగదారులు మోసపోతుంటారు. అలా డిస్కౌంట్ పేరుతో మోసం చేసిన సికింద్రాబాద్‌లోని చెన్నై షాపింగ్ మాల్‌కు జరిమానా విధించింది వినియోగదారుల కమిషన్. 2019 అక్టోబర్‌లో శ్రీకాంత్ అనే వ్యక్తికి చెన్నై షాపింగ్ మాల్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. తమ షాపింగ్ మాల్‌లో కొనుగోలు చేస్తే ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై ఐదు శాతం డిస్కౌంట్ అంటూ మెసేజ్ అందింది. దీంతో శ్రీకాంత్ అదే నెలలో షాపింగ్ మాల్‌కు వెళ్లి డ్రెస్‌లు, జువెలరీ కొనుక్కున్నాడు.

Man Quits Job: మూడున్నర కోట్ల జీతం.. బోర్ కొట్టి జాబ్‌కు రాజీనామా

తర్వాత ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో రూ.6,113 బిల్లు పే చేశాడు. అయినా, అతడికి డిస్కౌంట్ రాలేదు. దీంతో శ్రీకాంత్ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. తనకు షాపింగ్ మాల్ ప్రకటించినట్లుగా డిస్కౌంట్ రాలేదని, న్యాయం చేయాలని కోరాడు. దీనిపై విచారణ జరిపిన కమిషన్ వినియోగదారుడిని మోసం చేసినందుకు చెన్నై షాపింగ్ మాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడికి రావాల్సిన ఐదు శాతం డిస్కౌంట్‌తోపాటు పరిహారం కింద రూ.10 వేలు, కేసు ఖర్చుల కింద మరో రూ.5 వేలు ఇవ్వాలని ఆదేశించింది. మొత్తంగా వినియోగదారుడికి రూ.15,306 చెల్లించాలని సూచించింది.