Home » Author »Narender Thiru
రాహుల్ సాహు అనే పదేళ్ల బాలుడు తన ఇంటి వెనుక ఆడుకుంటూ, అక్కడే ఉన్న పాత బోరుబావిలో పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే జిల్లా ఎస్పీ విజయ్ అగర్వాల్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు ప్రారంభించారు.
ఇప్పటిదాకా విదేశాల్లోనే కనిపించిన ‘పింక్ లేక్’ ఇప్పుడు మన దేశంలోనూ పుట్టుకొచ్చింది. గుజరాత్‌లోని బనాస్ కాంతా జిల్లాలో ఉన్న సుగమ్ గ్రామంలోని చెరువు పింక్ కలర్లోకి మారిపోయింది. కొరేటి అనే పేరు గల ఈ చెరువు భారత్-పాకిస్తాన్ సరిహద్దులో ఉంది.
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12, ఎమ్మెల్యే కాలనీ సమీపంలో నిర్మిస్తున్న ఈ భవనానికి సంబంధించి.. దాచి ఉంచిన 38 కాపర్ బండిల్స్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. వీటి విలువ దాదాపు రూ.10 లక్షల వరకు ఉంటుంది.
ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం వల్లే సైబర్ నేరాలు జరుగుతున్నాయని, ప్రజలు మోసపోతున్నారని అన్నారు తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్. హైదరాబాద్‌లోని ఐఎస్బీలో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఇప్పటికే ఎమ్కే-1 క్షిపణి సైన్యం దగ్గర ఉంది. దీని రేంజ్ వంద కిలోమీటర్లు మాత్రమే. అందుకే కొత్తగా.. మరింత దూరంలోని లక్ష్యాలను చేధించగలిగే ఎమ్కే-2, ఎమ్కే-3 క్షిపణుల్ని రూపొందిస్తోంది డీఆర్డీఓ. ఎమ్కే-2ను వచ్చే ఏడాది పరీక్షిస్తే, ఎమ్కే-3ని 2024లో పర�
కడప జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న నకిలీ ఎం.ఎన్.వోను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. కడప నగరంలోని శ్రీ రాం నగర్‌కు చెందిన మణిదీప్ కోవిడ్ సమయంలో ఎం.ఎన్.వోగా పనిచేశాడు. అప్పటి అనుభవాన్ని వాడుకుంటూ మణిదీప్ దొంగతనాలకు పాల్పడుతున్నాడు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు చూసి తట్టుకోలేని చంద్రబాబు, లోకేష్‌లు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారు. పదో తరగతి పరీక్షల్లో తక్కువ ఉత్తీర్ణత వచ్చిందని రాజకీయం చేయడం టీడీపీ దిగజారుడుతనానికి నిదర్శనం.
ఈ నెల 18 నుంచి జూలై 9 వరకు అమెరికాలో భారీ ఎత్తున శ్రీవారి కల్యాణోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అమెరికాలోని ఏడు నగరాల్లో కల్యాణోత్సవాలు జరుగుతాయన్నారు.
విజయవాడలో మూడేళ్ల చిన్నారి షఫీదా కిడ్నాప్ కేసులో రైల్వే పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఐదు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి చిన్నారి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.
జూబ్లీహిల్స్ మైనర్ బాలిక రేప్ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులు పోలీసు కస్టడీలో ఉండగా, మరో ఇద్దరు నిందితుల కస్టడీకి కూడా కోర్టు అనుమతించింది. దీంతో శనివారం ఆరుగురు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు విచారించనున్నారు.
ఇకపై అమెరికా వచ్చే విదేశీ ప్రయాణికులు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు అమలులో ఉన్న ఈ నిబంధనను ఎత్తివేస్తూ బైడెన్ సర్కారు తాజాగా నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని అమెరికా ప్రకటించింది.
బాలికపై అత్యాచార ఘటనలో పోలీసులు అన్నిరకాల అవకతవకలకు పాల్పడ్డారు. అత్యాచారం జరిగింది ప్రభుత్వ వాహనంలోనే అని గుర్తించడానికి పోలీసులకు ఎందుకు ఆలస్యమైంది? దోషులను తప్పించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
తాజాగా ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడి గ్రామ పరిసరాల్లో పులి అడుగుజాడలను అధికారులు గుర్తించారు. అయితే, పులి అటవీ ప్రాంతం వైపు వెళ్తుందని అధికారులు అంచనా వేయగా, మళ్లీ యూ టర్న్ తీసుకుని ఏలేశ్వరం మండలం నుంచి వెనక్కి వచ్చింది.
తిరుమలలో గది విషయంలో టీటీడీ సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన బబ్లూ, సీనియర్ అధికారి వెంకటరత్నంపై దాడి చేశాడు. దీంతో వెంకట రత్నం ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు బబ్లూను అదుపులోకి తీసు�
మహానటుడు ఎన్టీఆర్‌తో తనకెంతో అనుబంధం ఉండేదని, ఆయన జనం నాడి తెలిసిన వ్యక్తి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సందర్భంగా గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొ�
క్రెడిట్ కార్డ్ యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆర్బీఐ. త్వరలో యూపీఐతో లింక్ చేసి క్రెడిట్ కార్డులతో కూడా పే చేయవచ్చు. ఇప్పటివరకు బ్యాంక్ సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్ నుంచి మాత్రమే యూపీఐ ద్వారా పే చేసే అవకాశం ఉండేది.
నాలుగు రోజులపాటు సాదుద్దీన్ మాలిక్‌ను విచారిస్తారు. చంచల్‌గూడ జైలు నుంచి నిందితుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తాంచారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలిస్తారు. తర్వాత సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తారు.
ఇంటిదగ్గర దింపుతామని బాలికను ట్రాప్ చేసి అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా వెల్లడైంది. జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో బాధిత బాలిక స్టేట్మెంట్ను పోలీసులు రెండోసారి రికార్డు చేసుకున్నారు.
రెండు నెలలుగా రాష్ట్రంలో ఉచిత బియ్యం పంపిణీ చేయని సంగతి తెలిసిందే. దీనిపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలకు కేంద్రం అందిస్తున్న ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయకపోతే రాష్ట్రం నుంచి బియ్యం సేకరణ నిలిపివేస్తామని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
తిరుమలలో ఒక ఎమ్మెల్యే అనుచరుడు వీరంగం సృష్టించిన ఘటనలో పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఈ విషయంలో టీటీడీ చైర్మన్ వెంటనే స్పందించాలి అని డిమాండ్ చేశారు.