Mr Ramu : అజయ్ ఘోష్ కీలక పాత్రలో మిస్టర్ రాము..
బొంత రాము హీరోగా, అజయ్ ఘోష్ మెయిన్ విలన్ గా నటిస్తున్న సినిమా మిస్టర్ రాము.(Mr Ramu)

Mr Ramu
Mr Ramu : బొంత రాము హీరోగా, అజయ్ ఘోష్ మెయిన్ విలన్ గా నటిస్తున్న సినిమా మిస్టర్ రాము. జబర్దస్త్ అప్పారావు కీలక పాత్రలో నటిస్తున్నారు. రేణుక దేవి ఫిలింస్ బ్యానర్ పై బొంత రాము నిర్మాణంలో అజయ్ కౌండిన్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు.(Mr Ramu)
ఈ కార్యక్రమంలో జబర్దస్త్ అప్పారావు మాట్లాడుతూ.. ఆడియో రిలీజ్ ఈవెంట్ కి ఇంతమంది వచ్చారంటే మీరంతా సినిమాను తప్పకుండా సక్సెస్ చేస్తారు. డైరెక్టర్ అజయ్ కౌండిన్య నాకు బాగా పరిచయం. ఈ సినిమాలో మంచి రోల్ ఇచ్చారు. అజయ్ ఘోష్ గారు ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసారు ఇందులో అని తెలిపారు.
Also Read : Sudigali Sudheer : ‘సర్కార్’ షో విన్నర్స్ కి బైక్స్ అందించిన సుడిగాలి సుధీర్..
నిర్మాత, హీరో బొంత రాము మాట్లాడుతూ.. నాకు హీరోగా నటించాలని కల ఉండేది. అజయ్ కౌండిన్య ఈ కథ చెప్పినప్పుడు నేనే చేద్దామని డిసైడ్ అయ్యాను. ఈ సినిమాలో ఆటో డ్రైవర్ రోల్ చేశాను. మిస్టర్ రాము తో పాటు నేను, డైరెక్టర్ అజయ్ కౌండిన్య కలిసి ఇంకో 9 సినిమాలు చేయబోతున్నాం. మిస్టర్ రాము సినిమా రిలీజైన వెంటనే మా కొత్త సినిమాను ప్రకటిస్తాం అని తెలిపారు.
డైరెక్టర్ అజయ్ కౌండిన్య మాట్లాడుతూ.. ఈ సినిమాలో మెసేజ్, ఎంటర్టైన్మెంట్ అంశాలు ఉంటాయి. ఆటోడ్రైవర్ పాత్రలో రాము గారు బాగా నటించారు. అజయ్ ఘోష్ గారు మా మీద అభిమానంతో ఈ సినిమాలో విలన్ గా నటించారు. ఆస్పత్రిలో చిన్నపిల్లల కిడ్నాప్స్ నేపథ్యంగా ఈ సినిమా తీసాము అని తెలిపాడు.
Also Read : Kanya Kumari : ‘కన్యా కుమారి’ మూవీ రివ్యూ.. విలేజ్ ప్రేమకథ.. హీరోయిన్ అదరగొట్టేసిందిగా..