Pressure Cooker: బాబోయ్.. ఆ కుక్కర్ ఇంత డేంజరా? బీకేర్ ఫుల్.. వెంటనే మార్చేయండి..! లేదంటే..
కొత్త వాటిని కొనేటప్పుడూ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే.. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్), ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) సర్టిఫికేషన్ ఉందా లేదా అని.

Pressure Cooker: ప్రతి ఇంట్లోని వంటింట్లో కామన్ గా కనిపించే వంట వస్తువు కుక్కర్. ఇది లేని వంటిల్లు ఉండదు. ఆహారాన్ని త్వరగా వండేందుకు బాగా యూజ్ అవుతుంది ప్రెజర్ కుక్కర్. అయితే, కుక్కర్ కి సంబంధించి ఓ విషయం అందరూ కచ్చితంగా తెలుసుకోవాలి.
లేదంటే మీ ఆరోగ్యానికి ప్రమాదం కొనితెచ్చుకున్నట్లు. మీ హెల్త్ డేంజర్ లో పడ్డట్లే.
కొన్ని సంవత్సరాలు మీరే ఒకే కుక్కర్ ని యూజ్ చేస్తున్నారా? బాగా పని చేస్తోంది కదా అని దాన్నే ఏళ్లుగా వినియోగిస్తున్నారా? అయితే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే అని చెబుతున్నారు నిపుణులు.
ముఖ్యంగా రీసైకిల్డ్ మెటల్‌తో చేసినవి అనేక ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడతాయట. ఎలా అంటే.. ఇవి ఆహారంలోకి సీసాన్ని విడుదల చేస్తాయి.
ఇది దీర్ఘకాలంలో శరీరంలోకి చేరితే.. మెదడు, మూత్రపిండాలు, ఎముకలే కాదు నరాలపైనా దుష్ప్రభావాలను చూపెడుతుందని హెచ్చరించారు.
పిల్లల్లో నేర్చుకోవడంలో ఇబ్బందులు, పెద్ద వారిలో మతిమరపు, దీర్ఘకాలిక వ్యాధులకూ కారణమవుతుందన్నారు.
కుక్కర్ ఎంత బాగా వర్క్ చేస్తున్నపట్టికి.. పాతవి, గీతలు పడ్డ కుక్కర్లను వాడొద్దని నిపుణులు సూచిస్తున్నారు. అందుకు బదులుగా స్టీల్, అయొనైజ్జ్ అల్యూమినియం కుక్కర్లను ఎంచుకుంటే మేలు అంటున్నారు. అలాగే మెటల్ వాటిలో ఆమ్ల గుణాలున్న (టొమాటో, చింతపండు వంటివి) ఆహారాలను ఈ పాత్రలో ఎక్కువసేపు ఉంచొద్దని సూచిస్తున్నారు.
కొత్త వాటిని కొనేటప్పుడూ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే.. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్), ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) సర్టిఫికేషన్ ఉందా లేదా అని.
Also Read: నీళ్లు అధికంగా తాగుతున్నారా.. ప్రమాదంలో కిడ్నీలు.. జాగ్రత్త సుమీ