Metabolism: మెటబాలిజం పెంచే బూస్టర్ ఫుడ్.. రోజు తింటే ఏ రోగాలు దరిచేరవు

మెటబాలిజం అనేది శరీరంలో జరిగే అన్ని రకాల రసాయనిక చర్యల సముదాయం(Metabolism). దీని ప్రధాన పని ఏంటంటే.. తిన్న ఆహారాన్ని

Metabolism: మెటబాలిజం పెంచే బూస్టర్ ఫుడ్.. రోజు తింటే ఏ రోగాలు దరిచేరవు

5 types of booster foods that increase metabolism

Updated On : August 26, 2025 / 4:13 PM IST

Metabolism: మెటబాలిజం అనేది శరీరంలో జరిగే అన్ని రకాల రసాయనిక చర్యల సముదాయం. దీని ప్రధాన పని ఏంటంటే.. తిన్న ఆహారాన్ని శక్తిగా మార్చడం, కణజాలాల నిర్మాణం, మరమ్మతు, శ్వాసక్రియ, జీర్ణక్రియ, రక్త ప్రసరణ వంటి క్రియలను నిర్వహించడం. వీటిలో ఏ ఒక్కటి సరిగా జరిగాక పోయినా శరీరం అనారోగ్యపాలవడం ఖాయం. అందుకే, నిపుణులు చెప్తూ ఉంటారు.. మెటబాలిజం సరిగా ఉండాలని. మెటబాలిజం(Metabolism) పెరగాలంటే సరైన ఆహరం చాలా అవసరం. కాబట్టి, మెటబాలిజాన్ని డబుల్ చేసే 5 రకాల శక్తివంతమైన ఆహారం గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

Junk Food: జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారా? ఆరోగ్యాన్ని పనంగా పెట్టినట్టే.. ఈ తిప్పలు తప్పవు

మెటబాలిజం తగ్గిపోతే ఏమవుతుంది?

మెటబాలిజం తగ్గిపోతే బరువు వేగంగా పెరుగుతుంది. అలసటగా ఉంటుంది, జీర్ణక్రియ మందగిస్తుంది, చర్మం మారుతుంది, మానసిక ఉత్సాహం తగ్గిపోతుంది. కాబట్టి, మెటబాలిజాన్ని ఉత్తేజితం చేసే ఆహరం తీసుకురావడం చాలా అవసరం.

మెటబాలిజాన్ని పెంచే 5 రకాల ఆహారాలు:

1.అల్లం:
అల్లంలో థర్మోజెనిక్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను స్వల్పంగా పెంచి మెటబాలిజాన్ని వేగవంతం చేస్తుంది. అల్లం టీ రూపంలో, అన్నంలో, కూరగాయలలో చేర్చడం మంచిది ఫలితాలు అందుతాయి.

2.స్పైసీ ఫుడ్స్:
మిరపకాయలలో ఉండే కాప్సైసిన్ (Capsaicin) అనే పదార్ధం శరీరంలో కాలరీ ఖర్చును పెంచుతుంది. ఇది మెటబాలిజాన్ని 8% వరకు వేగవంతం చేస్తుంది. కాబట్టి, మిరపకాయలను మోతాదులో తినడం ద్వారా మంచి ఫలితాలు అందుతాయి.

3.గ్రీన్ టీ:
గ్రీన్ టీలో ఉండే కాటెకిన్స్ (Catechins), కేఫిన్ మెటబాలిక్ రేటును పెంచడంలో అద్భుతంగా సహాయపడతాయి. రోజుకు 2 నుంచి 3 కప్పులు తాగితే ఫలితం కనిపిస్తుంది. దీనికి కొవ్వును కరిగించే సామర్థ్యం కూడా ఉంటుంది.

4.ప్రోటీన్ రిచ్ ఫుడ్:
ప్రోటీన్ జీర్ణం అవడానికి శరీరానికి ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. కోడిగుడ్లు, పన్నీర్, చేపలు, శనగలు, మటన్ వంటివి అధిక ప్రోటీన్ తో కూడుకున్నవి. వీటిని ఆహారంలో చేర్చడం వల్ల మెటబాలిజం అద్భుతంగా పెరుగుతుంది.

5.నీరు:
ప్రతిరోజు తగినంత నీరు తాగడం చాలా మంచి ఫలితాలను అందిస్తుంది. ఇది మెటబాలిజాన్ని చాలా మెరుగుపరుస్తుంది. ఒక గ్లాస్ నీరు తాగినప్పుడు, శరీర ఉష్ణోగ్రత స్థిరపర్చేందుకు శక్తిని ఖర్చు చేస్తుంది.

సహాయపడే జాగ్రత్తలు:

  • నిద్రలేమి మెటబాలిజాన్ని మందగిస్తుంది
  • వ్యాయామం చేయడం మెటబాలిజాన్ని ఎక్కువసేపు యాక్టివ్‌గా ఉంచుతాయి
  • ఊపిరి పీల్చే వ్యాయామాలు / యోగా
  • భోజనం మిస్ కాకుండా తినడం