Virata Parvam: విరాటపర్వం ట్రైలర్ లాంఛ్ వేదిక వద్ద ప్రమాదం.. తప్పిన ముప్పు
కర్నూలులో ఆదివారం నిర్వహించతలపెట్టిన విరాట పర్వం ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ వేదిక వద్ద ప్రమాదం జరిగింది. ఔట్‌డోర్ స్టేడియంలో నిర్మించిన స్టేజ్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్ కూలిపోయింది.

Virata Parvam
Virata Parvam: కర్నూలులో ఆదివారం నిర్వహించతలపెట్టిన విరాట పర్వం ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ వేదిక వద్ద ప్రమాదం జరిగింది. ఔట్‌డోర్ స్టేడియంలో నిర్మించిన స్టేజ్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్ కూలిపోయింది. భారీగా వీచిన ఈదురు గాలుల ప్రభావంతో స్క్రీన్ కూలినట్లు నిర్వాహకులు చెప్పారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. చిత్ర హీరో రానా, హీరోయిన్ సాయి పల్లవి, ఇతర టెక్నీషియన్స్ వేదిక వద్దకు చేరడానికి ముందే ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం గాలి బీభత్సం ఎక్కువగా ఉండటంతో వేదిక వద్ద విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
Pawan Kalyan As CM: పవన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి.. బీజేపీకి జనసేన అల్టిమేటమ్
దీంతో స్టేడియం అంతా చీకటి అలుముకుని ఉంది. ఘటన జరిగే సమయానికి స్టేజిపై ఉన్న గాయనీ, గాయకులను నిర్వాహకులు సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు. ఇదే సమయంలో వర్షం కూడా మొదలైంది. దీంతో కార్యక్రమం నిలిచిపోయింది. చివరకు కొందరు అభిమానులు నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు. ప్రస్తుతం పోలీసులు, నిర్వాహకులు అందరినీ సురక్షితంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.