Pawan Kalyan As CM: పవన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి.. బీజేపీకి జనసేన అల్టిమేటమ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని బీజేపీకి జనసేన నేతలు అల్టిమేటమ్ జారీ చేశారు. బీజేపీ-జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని జనసేన నేతలు డాక్టర్ హరిప్రసాద్, కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు.

Pawan Kalyan As CM: పవన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి.. బీజేపీకి జనసేన అల్టిమేటమ్

Pawan Kalyan

Pawan Kalyan As CM: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని బీజేపీకి జనసేన నేతలు అల్టిమేటమ్ జారీ చేశారు. బీజేపీ-జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని జనసేన నేతలు డాక్టర్ హరిప్రసాద్, కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. జనసేన నేతలు తిరుపతిలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘‘బీజేపీ జాతీయ అధ్యక్షుడు నద్దా విజయవాడ పర్యటనలోనే పవన్ కళ్యాణ్‌ను రెండు పార్టీల ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి. బీజేపీలో సీఎం అయ్యే స్థాయి వ్యక్తులు ఎవరూ లేరు. ఏపీలో అధికార పార్టీపై ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.

Ganta Srinivasa Rao: ప్రభుత్వ చేతకానితనంతోనే పరీక్షా ఫలితాల విడుదల వాయిదా: గంటా శ్రీనివాసరావు

పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలని మోదీ అన్నారు. మీరు పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాంరో.. లేక చెవిలో పువ్వులు పెడతారో రెండు రోజుల్లో తెలుస్తుంది. నద్దా పర్యటన తర్వాత తదుపరి కార్యాచరణ జనసేనదే’’ అని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు.