Home » Author »Narender Thiru
టీ 20 వరల్డ్ కప్‌లో భారత జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. నెదర్లాండ్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఇండియా 56 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బ్యాట్స్మెన్లు ముగ్గురూ హాఫ్ సెంచరీలు నమోదు చేయడం విశేషం.
‘ఫైర్ హెయిర్ కట్’ చేయించుకుంటున్నారా? అయితే జాగ్రత్త! ఎందుకంటే తాజాగా ‘ఫైర్ హెయిర్ కట్’ ఒక యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ కటింగ్ చేసుకునేందుకు ప్రయత్నించిన కుర్రాడు ప్రస్తుతం గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన వ్యవహారంపై సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పందించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు ఈ దాడి చేసినట్లు చెప్పారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిన భారీ ఆపరేషన్‌ను తెలంగాణ పోలీసులు విఫలం చేశారు. మొయినాబాద్‌లోని ఫాంహౌజ్‌పై దాడి చేసి నలుగురు మధ్యవర్తుల్ని పట్టుకున్నారు. వారి నుంచి రూ.15 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. పదవి స్వీకరించిన మొదటి రోజే పార్టీలో కీలకమైన మార్పు చేశారు. సీడబ్ల్యూసీని రద్దు చేసి, స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు.
రష్యా-యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఏ దేశమూ, ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వస్త్రాలు ప్రయోగించకూడదని సూచించింది ఇండియా. ఈ మేరకు రష్యా రక్షణ శాఖ మంత్రితో దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫోన్లో మాట్లాడారు.
ఇప్పటికే ప్రపంచాన్ని కుదిపేస్తున్న ద్రవ్యోల్బణ ప్రభావం వచ్చే ఏడాది కూడా కొనసాగనుంది. అయితే, దీని ప్రభావం వేతనాల పెరుగుదలపై అధికంగా ఉండే అవకాశం ఉంది. ఐరోపా, అమెరికాలో వేతనాల పెరుగుదల శాతం చాలా తక్కువగా ఉంటుంది.
అమెరికాలో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగువాళ్లు మరణించారు. వీరిలో ఇద్దరు యవకులు, ఒక యువతి ఉన్నారు. ఇద్దరు తెలంగాణ వాళ్లుకాగా, ఒకరిది ఏపీ.
అయోధ్యలో చేపట్టిన రామ మందిర నిర్మాణం ఇప్పటికే 50 శాతం పూర్తైంది. రూ.1,800 కోట్లతో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. కాగా, ఆలయ నిర్మాణానికి సంబంధించిన వివరాల్ని ట్రస్టు సభ్యులు వెల్లడించారు.
కెనడాలో భారత సంతతి మహిళ సంచలనం సృష్టించారు. బ్రాంప్టన్ సిటీ కౌన్సిలర్‌గా సిక్కు మహిళ నవ్‌జిత్ కౌర్ బ్రార్ ఎన్నికయ్యారు. ఈ ఘనత దక్కించుకున్న తొలి తలపాగా చుట్టుకున్న సిక్కు మహిళగా నిలిచారు.
క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నాయనే కారణంతో డవ్, ట్రెసెమె వంటి షాంపూల్ని వెనక్కు తీసుకుంది యునిలీవర్ సంస్థ. అమెరికాకు చెందిన ‘ఫుడ్ అండ్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్’ ఇచ్చిన నోటీసులు నేపథ్యంలో కంపెనీ ఈ చర్య తీసుకుంది.
కారు పార్కింగ్ విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన గొడవ ఒకరి హత్యకు దారి తీసింది. ఒక వ్యక్తి, మరో వ్యక్తి తలపై ఇటుకతో దాడి చేసి కొట్టాడు. దీంతో అతడు అక్కడికక్కడే మరణించాడు.
మంగళవారం వాట్సాప్ సేవలు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రెండు గంటలపాటు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై వాట్సాప్ మాతృసంస్థ ‘మెటా’ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సేవలు ఆగిపోయేందుకు గల కారణాన్ని వెల్లడించింది.
ఢిల్లీ నగరంలో పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని అడ్డుకునేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. తాజగా ‘రెడ్ లైట్ ఆన్.. గాడి ఆఫ్’ అనే కొత్త ప్రచారం ప్రారంభించింది. దీని ప్రకారం సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడగానే బండి ఇంజిన్ ఆఫ్ చేయా
అక్రమంగా రవాణా చేస్తున్న మూగజీవాల్ని చెన్నై ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ముంగిస, కాస్కస్ అనే మరో జీవిని బ్యాగులో కుక్కి తరలిస్తుండగా అధికారులు గుర్తించారు. వీటిని బ్యాంకాక్ నుంచి తీసుకొచ్చారు.
దీపావళి సందర్భంగా సరదా కోసం అపార్ట్మెంట్లోకి రాకెట్లు ప్రయోగించాడో వ్యక్తి. కింది నుంచి కాల్చిన రాకెట్లు నేరుగా అపార్టుమెంట్‌లోని ఫ్లాట్లలోకి దూసుకెళ్లాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అరుణాచల్ ప్రదేశ్, ఈటానగర్‌లో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒక ప్రాంతంలోని దాదాపు 700 షాపులు అగ్నికి ఆహుతయ్యాయి.
దేశంలో ఆస్తుల బదిలీ ప్రక్రియ ఎంత కష్టమైందో తెలిసిందే. ఈ ప్రక్రియలో అనేక నిబంధనల్ని పాటించాలి. అందుకే ఈ విషయంలో దాదాపు 86 శాతం కుటుంబాలు లంచాలు ఇచ్చుకోవాల్సి వస్తుందని తాజా సర్వే ఒకటి తేల్చింది.
‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ లక్కీ డ్రాలో విజేతగా నిలిచావంటూ ఒక మహిళను నమ్మించారు సైబర్ కేటుగాళ్లు. రూ.35 లక్షల నగదు, బీఎండబ్ల్యూ కారు గెలిచావని, వీటిని సొంతం చేసుకోవాలంటే రూ.9 లక్షలు పన్నులు చెల్లించాలని సూచించారు. వెంటనే ఆమె వారు అడిగినంత డబ్బు ట్�
రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో, దీపావళిని పురస్కరించుకుని ఈ యాత్రలో పాల్గొంటున్న సిబ్బంది, సహాయకులకు రాహుల్ కానుకుల అందించాడు.