Home » Author »Narender Thiru
రైల్వే ట్రాక్ పక్కన ఆడుకుంటుండగా చిన్నారులకు ఒక ప్యాకెట్లో కనిపించిందో వస్తువు. గుండ్రంగా ఉండటంతో దాన్ని బాల్ అనుకున్నారు. దానితో ఆడుకోవడం మొదలుపెట్టారు. కాస్సేపట్లో అది పేలిపోయింది.
మంగళవారం దేశంలో కనిపించబోయే సూర్య గ్రహణం చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే దాదాపు దశాబ్దంన్నర తర్వాత మన దేశంలో కనిపిస్తున్న సూర్య గ్రహణమిది.
రోడ్డు పక్కన నిస్సహాయ స్థితిలో గాయాలతో, రక్తస్రావంతో పడి ఉందో బాలిక. అయితే, స్థానికులు ఆమెకు సాయం చేయాల్సింది పోయి, చుట్టూ చేరి వీడియోలు తీసుకున్నారు. దీనిపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
దాదాపు రెండు గంటలపాటు నిలిచిపోయిన వాట్సాప్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం వాట్సాప్ సేవలు నిలిచిన సంగతి తెలిసిందే.
నకిలీ పత్రాలతో మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్‌లో మోసానికి పాల్పడ్డారు కొందరు లాయర్లు. దీంతో ఈ మోసానికి పాల్పడ్డ 30 మంది లాయర్ల లైసెన్స్ రద్దు చేసింది ఉత్తర ప్రదేశ్ బార్ కౌన్సిల్.
కర్ణాటకలో ఒక మంత్రి తన నియోజకవర్గంలోని కొందరు ప్రజా ప్రతినిధులకు ఖరీదైన బహుమతులు అందించాడు. గిఫ్టు బాక్సుల్లో రూ.లక్ష నగదు, బంగారం, వెండి, పట్టు చీర, ధోతి వంటివి ఉన్నాయి.
స్కూలు నుంచి ఇంటికి వెళ్తున్న పదహారేళ్ల అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడో వ్యక్తి. ఆమె జుట్టు పట్టుకుని వేధిస్తూ, ఐటమ్ అని పిలిచాడు. దీనిపై బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై కోర్టు విచారణ జరిపి, నిందితుడికి జైలు శిక్ష విధించింది.
ఆంధ్రప్రదేశ్, పార్వతిపురం జిల్లాలో జరిగిన అగ్ని ప్రమాదంలో దీపావళి స్పెషల్ సేల్ కోసం సిద్ధంగా ఉంచిన ఈ-బైకులు అగ్నికి ఆహుతయ్యాయి. సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది.
తనను చూస్తున్నందుకే ఒక వ్యక్తిపై ముగ్గురు దాడి చేశారు. ఈ దాడిలో బాధితుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ దారుణ ఘటన ముంబైలో జరిగింది.
ఉద్ధవ్ థాక్రే ఆధ్వర్యంలోని శివసేన నుంచి షిండే వర్గంలో చేరిన ఎమ్మెల్యేల్లో చాలా మంది అసంతృప్తితో ఉన్నారని, వారిలో 22 మంది త్వరలోనే బీజేపీలో చేరుతారని సామ్నా పత్రిక ఒక కథనం ప్రచురించింది. ఈ పత్రిక శివసేన పార్టీకి చెందిన పత్రిక అని తెలిసిందే.
న్యూయార్క్‌లో దాడికి గురైన ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ ఒక కంటి చూపు కోల్పోయినట్లు సమాచారం. అలాగే ఒక చేయి కూడా పని చేయడం లేదని సల్మాన్ ప్రతినిధి వెల్లడించినట్లు ఒక మీడియా సంస్థ కథనం ప్రచురించింది.
భారత్-పాక్ మ్యాచ్, చివరి ఓవర్ నాలుగో బంతిని అంపైర్లు ‘నో బాల్’గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ‘నో బాల్’పై ప్రస్తుతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అంపైర్ల నిర్ణయాన్ని తప్పుబడుతుంటే, మరికొందరు సమర్ధిస్తున్నారు.
పాకిస్తాన్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు విరాట్ కోహ్లీ. మ్యాచులో గెలుపు అనంతరం తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.
స్కూలు డెవలప్మెంట్ పేరిట పేరెంట్స్ నుంచి ప్రతి నెలా రూ.100 వసూలు చేయాలన్న నిర్ణయాన్ని కర్టాటక సర్కారు వెనక్కి తీసుకుంది. జీవో జారీ చేసిన నాలుగు రోజుల్లోనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.
నగల షో రూమ్‌లో పని చేసే ఉద్యోగులే ఓనర్‌ను బంధించి నగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన గుజరాత్, అహ్మదాబాద్‌లో ఆదివారం వేకువఝామున జరిగింది.
తల్లికి ఇంటి పనుల్లో సాయం చేసేందుకు ఒక రోబో తయారు చేశాడు తనయుడు. స్కూలు ప్రాజెక్టులో భాగంగా తయారు చేసిన ఈ రోబో ఇంట్లో ఆహారం అందించడం, న్యూస్ పేపర్ తేవడం వంటి పనులు చేస్తోంది.
గత జూలైలో కెన్యాలో ఇద్దరు భారతీయులు కనిపించకుండా పోయారు. వీరి అదృశ్యంపై స్పందించిన కోర్టు, విచారణ కోసం ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఇద్దరినీ దుండగులు హత్య చేసినట్లు విచారణ బృందం తేల్చింది.
ఇండియా-పాక్ మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత జాతీయ గీతాన్ని ప్లే చేస్తున్నప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ భావోద్వేగానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ వచ్చే నెలలో ఇండియాలో పర్యటించనున్నారు. నవంబర్ 14న ఆయన ఇండియాలో పర్యటిస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి.
యుక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే భారతీయులు.. యుక్రెయిన్ విడిచి వెళ్లాలని ఆదేశించిన ప్రభుత్వం, ఇప్పుడు ఎలా వెళ్లాలో వివరిస్తూ కొన్ని సూచనలు చేసింది.