Home » Author »Narender Thiru
బీజేపీకి మరో నేత గుడ్‌బై చెప్పారు. సీనియర్ నేత స్వామి గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటికే రాజీనామా చేసిన దాసోజ్ శ్రవణ్‌తో కలిసి స్వామి గౌడ్ టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉంది.
ఢిల్లీ పరిధిలో టపాసులపై అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది. తాజా నిబంధనల ప్రకారం.. టపాసులు కాల్చినా, అమ్మినా, తయారు చేసినా, రవాణా చేసినా రూ.200 నుంచి రూ.5,000 వరకు జరిమానాతోపాటు, జైలు శిక్ష విధిస్తారు.
యుక్రెయిన్‌లో ఉంటున్న భారతీయుల గురించి... యుక్రెయిన్ రావాలనుకుంటున్న భారతీయుల గురించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. యుక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం బుధవారం ఈ ప్రకటన విడుదల చేసింది.
దేశంలో కొన్ని కార్లకు అత్యధిక డిమాండ్ ఉంటోంది. ఇష్టపడి కొందామంటే మార్కెట్లో దొరకని పరిస్థితి. ఆ వాహనాలు కావాలంటే ముందుగా అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని నెలలకు డెలివరీ ఇస్తారు.
డాలరుతో రూపాయి విలువ పతనం కొనసాగుతోంది. రూపాయి అత్యంత కనిష్టానికి చేరింది. డాలరుతో రూపాయి 82.36కు చేరింది. ఒక దశలో 82.99కు, ఆపై 83.02కు చేరింది.
సాధారణ కార్మిక నాయకుడి నుంచి దేశంలో ఘనమైన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎదిగారు మల్లికార్జున ఖర్గే. కర్ణాటక నుంచి మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం నేడు దేశంలోని ప్రధాన పార్టీకి జాతీయ స్థాయిలో నాయకత్వం వహించే స్థాయికి ఎదిగిన తీరు ఆద
రష్యా-యుక్రెయిన్ యుద్ధంలోకి నాటోతోపాటు, ఇరాన్ కూడా చేరుతోంది. అయితే, అది పరోక్షంగా. రష్యాకు మరిన్ని డ్రోన్లు, మిస్సైల్స్ ఇస్తామని ఇరాన్ ప్రకటించింది. దీనికి ప్రతిగా తాము యాంటీ-డ్రోన్ సిస్టమ్ ఇస్తామని నాటో తెలిపింది.
దేశంలో రెండో సంపన్నుడు, రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ దుబాయ్‌లో అత్యంత భారీ విల్లా కొనుగోలు చేశారు. ఈ విషయంలో తన రికార్డును తనే బ్రేక్ చేశారు అంబానీ. ఇంతకుముందే ఒక విల్లా కొనుగోలు చేయగా, ఇప్పుడు దానికి రెట్టింపు ధరతో విల్లా కొన్నాడు.
దేశంలోని స్కూళ్లను కలిసి బాగు చేద్దామంటూ ప్రధాని మోదీకి పిలుపునిచ్చారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. మోదీ గుజరాత్ పర్యటనలో భాగంగా ఒక స్కూల్‌ను సందర్శించారు. దీనిపై కేజ్రీవాల్ స్పందిస్తూ ప్రధాని మోదీకి కేజ్రీవాల్ ఒక సూచన చేశారు.
రూమ్‌లో వంట చేసే విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య వాగ్వాదం తలెత్తింది. ఇది పెద్ద గొడవకు దారి తీసింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో గత ఆదివారం జరిగింది.
ఢిల్లీ పరిధిలోని ఘజియాబాద్‌లో మరో నిర్భయ తరహా ఘటన జరిగింది. 40 ఏళ్ల మహిళను కారులో ఎత్తుకెళ్లిన ఐదుగురు వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దాదాపు రెండు రోజులపాటు అత్యాచారం చేశారు. అనంతరం రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు.
ఈ నెల 25, మంగళవారం రోజు దేశంలో పాక్షిక సూర్య గ్రహణం ఏర్పడబోతుంది. దీనికి చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ సారి మిస్సైతే, తిరిగి దేశంలో సూర్య గ్రహణం కనిపించేది 2032లోనే.
స్కూలు ఫీజు కట్టలేదని ఒక చిన్నారిని పరీక్షకు అనుమతించలేదు ప్రైవేటు స్కూలు యాజమాన్యం. దీంతో ఆ చిన్నారి ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. ఈ సంఘటనను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ.
1993 ముంబై వరుస పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీంతోపాటు, 26/11 ముంబై దాడులకు ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్‌ను అప్పగిస్తారా అని పాక్ అధికారిని భారత్ ప్రశ్నించింది. దీనికి పాక్ అధికారి సమాధానం ఏంటంటే..
భార్య కాపురానికి రావడం లేదని ఆమెతోపాటు, ఇద్దరు పిల్లలు, అత్తామామలు.. మొత్తం ఐదుగురిని సజీవ దహనం చేశాడో దుర్మార్గుడు. అత్తారింటికి వెళ్లి, అక్కడ నిద్రిస్తున్న వారిపై పెట్రోల్ పోసి ఈ దారుణానికి ఒడిగట్టాడు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీతా రెడ్డి చెప్పినవన్నీ నిజాలే అని, రాష్ట్ర పోలీసులు, నిందితులు కుమ్మక్కయ్యారని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి బుధవారం విచారణ జరగనుంది.
దేశంలోకి మరో కరోనా కొత్త వేరియంట్ ప్రవేశించింది. ఒమిక్రాన్ బీఎఫ్7 పేరుతో వచ్చిన కొత్త వేరియంట్ త్వరగా వ్యాపించే సామర్ధ్యం కలిగి ఉంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మహిళల ఐపీఎల్ త్వరలో ప్రారంభం కానుంది. దీనికి తాజాగా బీసీసీఐ అంగీకారం తెలిపింది. వచ్చే ఏడాది మార్చి నుంచి ఈ టోర్నీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
దేశంలో త్వరలోనే శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ అందించే సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎలన్ మస్క్ స్థాపించిన ‘స్టార్‌లింక్’ సంస్థ దీనికోసం కేంద్రానికి దరఖాస్తు చేసుకుంది. కేంద్రం అనుమతిస్తే మరకొద్ది రోజుల్లోనే ఈ సేవలు మొదలవుతాయి.
హైకోర్టులో టీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. తమ కారు గుర్తును పోలిన వేరే గుర్తులను స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించవద్దని కోరుతూ టీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.