Home » Author »Narender Thiru
పాకిస్తాన్ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర దేశాల్లో ఒకటని అన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. అమెరికాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత మహిళా క్రికెట్ జట్టు ఆసియా కప్ సొంతం చేసుకుంది. శనివారం శ్రీలంకతో జరిగిన ఫైనల్ మ్యాచులో అద్భుతంగా రాణించి విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్.. రెండింట్లోనూ అదరగొట్టింది. ఏడోసారి ఆసియా కప్ గెలుచుకుంది.
మూగజీవాలకూ బోలెడంత తెలివి ఉంటుంది. వాటి జీవనానికి అవసరమైన తెలివితేటల్ని అవి కలిగి ఉంటాయి. కావాలంటే ఈ వీడియో చూడండి. మంచు ఫలకలపై వెళ్లే ఒక ధృవపు ఎలుగబంటి ఆ ఫలకలు పగలకుండా ఎలా నడిచిందో చూడండి.
మావోయిస్టులతో సంబంధాల విషయంలో అరెస్టై జైలు శిక్ష అనుభవిస్తున్న సాయిబాబాకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఆయనను విడుదల చేయాలంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేసింది.
ఇటీవల మరణించిన ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పదేళ్ల బాలుడు ఇంటి నుంచి పారిపోయాడు. రైలులో ఒంటరిగా ప్రయాణిస్తున్న బాలుడిని రైల్వే పోలీసులు గమనించారు. తండ్రికి సమాచారం అందించారు.
విద్యార్థిని విషయంలో టీచర్ ప్రవర్తించిన తీరు ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడేలా చేసింది. పరీక్షలో బాలిక కాపీ కొడుతుందని భావించిన టీచర్ ఆమె దుస్తులు విప్పించింది. దీంతో అవమానంగా భావించిన బాలిక ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసింద�
లోన్ కోసం ఏకంగా ఎస్బీఐ ఛైర్మన్‌కే కాల్ చేసి బెదిరించాడో దుండగుడు. తను కోరినట్లుగా లోన్ ఇవ్వకుంటే కిడ్నాప్ చేసి చంపుతానని బెదిరించాడు. అంతేకాదు ఎస్బీఐ ప్రధాన కార్యాలయాన్ని పేల్చేస్తానని చెప్పాడు.
పండుగల సందర్భంగా దేశవ్యాప్తంగా వంట నూనెలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. దీంతో డిమాండ్ పెరిగి, ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. సోయాబీన్, సన్ ఫ్లవర్, వేరు శనగ నూనెల ధరలు భారీగా పెరిగాయి.
మునుగోడు ఉప ఎన్నికవేళ టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీలో కీలక నేతగా ఉన్న మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్కు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను సీఎం కేసీఆర్‌కు పంపారు.
బీఎండబ్ల్యూ కారు, కంటైనర్ ట్రక్కు ఢీకొన్న ఘటన ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించారు. అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఐఫోన్లు వాడేవాళ్లకు ఛార్జింగ్ కేబుల్ దొరకడం ఒక సమస్య. ఎప్పుడైనా ఫోన్లో బ్యాటరీ డౌన్ అయ్యి, ఛార్జింగ్ చేసుకుందామంటే యాపిల్ ఫోన్లకు పనికొచ్చే కేబుల్ దొరకదు. దీనికి ప్రత్యేక కేబుల్ ఒకటి అదనంగా ఎప్పుడూ వెంట ఉంచుకోవాల్సిందే. అయితే, వచ్చే ఏడాది న
డేరా బాబాగా పేరు పొందిన డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు తాజాగా మరోసారి బెయిల్ లభించింది. ఈ సారి ఆయన 40 రోజులు పెరోల్‌పై విడుదల కానున్నారు. ఈ ఏడాది ఇలా పెరోల్‌పై విడుదల కావడం ఇది మూడోసారి.
కారులో సీట్ బెల్టు పెట్టుకోకుంటే ఇకపై డ్రైవర్‌తోపాటు, ప్రయాణికులు కూడా చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సిందే. నవంబర్ 1 నుంచి ముంబై పరిధిలో తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని, లేకుంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
మావోయిస్టులతో సంబంధాల విషయంలో అరెస్టైన మాజీ ప్రొఫెసర్ సాయిబాబాను విడుదల చేయాలంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును ఎన్ఐఏ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఆయన విడుదలపై స్టే విధించాలని కోరింది.
ట్రాఫిక్ తనిఖీలు నిర్వహిస్తుండగా, తమ బండి ఆపకుండా వెళ్లారు ఇద్దరు యువకులు. దీంతో ఒక పోలీసు వారిని కర్రతో కొట్టాడు. మరో కానిస్టేబుల్ వారిపైకి దూకి, కిందికి తోసేశాడు. దీంతో ఇద్దరూ బైక్ పై నుంచి కిందపడిపోయారు.
ఆర్ఆర్ఆర్, అల వైకుంఠపురం, లవ్ స్టోరీ వంటి సినిమాల్లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించిందో ముఠా. బాధితుల నుంచి మొత్తం రూ.6 కోట్ల వసూళ్లకు పాల్పడింది.
మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. శుక్రవారం మధ్యాహ్నానికి నామినేషన్ల పర్వం పూర్తైంది. దాదాపు 140 నామినేషన్లు దాఖలుకాగా, వంద మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు.
రెడీ టు ఈట్ పరాటాలపై గుజరాత్ ప్రభుత్వం 18 శాతం జీఎస్టీ విధించబోతుంది. ఈ నిర్ణయాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తప్పుబట్టారు. బ్రిటీష్ పాలనలో కూడా దేశంలో ఆహార పదార్థాలపై పన్ను లేదన్నారు.
గత 80 రోజులుగా తమ సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మె చేసిన వీఆర్ఏలు బుధవారం సమ్మె విరమించారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలమైనట్లు పేర్కొన్నారు. గురువారం నుంచి విధులకు హాజరుకానున్నట్లు చెప్పారు.
ఏడాది కాలంగా ఖరీదైన నగలన్నీ చోరీకి గురవుతున్నాయి ఆ ఇంట్లో. అయినా, అందరూ ఏమీ తెలియనట్లే ఉండిపోయారు. నగలు పోతున్నా పట్టించుకోలేదు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. దీనికో కారణం ఉంది. ఈ కారణం తెలిసి పోలీసులు షాకయ్యారు.