Home » Author »Narender Thiru
రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ కర్ణాటకలో విజయవంతంగా సాగుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ధరించిన టీ షర్టు సంచలనంగా మారింది. బీజేపీని విమర్శిస్తూ టీ షర్ట్‌పై కన్నడలో ఒక కొటేషన్ రాశారు.
మొట్టమొదటి ఎలక్ట్రిక్ ‘ఫ్లయింగ్ కార్’ను తయారీ దారులు దుబాయ్‌లో విజయవంతంగా పరీక్షించారు. ఈ కారు దాదాపు 90 నిమిషాలపాటు ఎగిరింది. ఈ కారులో ఇద్దరు ప్రయాణించవచ్చు.
దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. గత సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.41 శాతంగా నమోదైంది. ఇది ఆగష్టు నెలతో పోలిస్తే 0.41 శాతం ఎక్కువ. దీని కారణంగా ఆహారోత్పత్తుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.
ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా వరకు నిర్మించే మెట్రో రైల్ కారిడార్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరారు ఏఐఎమ్ఐఎమ్ నేత అక్బరుద్దీన్ ఒవైసీ. ఈ ప్రాజెక్టు ఆలస్యంపై ఆయన మెట్రో రైల్ ఎండీతో చర్చించారు.
మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి గురువారం టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ కూడా హాజరవుతారు.
రైల్వే ఉద్యోగులకు కేంద్రం బోనస్ ప్రకటించింది. నాన్-గెజిటెడ్ సిబ్బందికి 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా అందివ్వనుంది కేంద్రం. ఈ నిర్ణయానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
రైతులు పొలాలు తగలబెడితే ఎకరానికి రెండున్నర వేల రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు ఢిల్లీ, గురుగ్రామ్ అధికారులు. పొలాలు తగలబెట్టడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతుందని వారు అంటున్నారు.
రెండేళ్లుగా వీసాల కోసం ఎదురు చూస్తున్న భారతీయ విద్యార్థులకు చైనా గుడ్‌న్యూస్ చెప్పింది. దాదాపు 1,300కు పైగా విద్యార్థులకు వీసాలు మంజూరు చేసినట్లు చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది. అయితే, వీసాలు కావాల్సిన విద్యార్థులు ఇంకా వేలల్లోనే ఉన్నారు.
ముంబైలోని ఫిలింసిటీలో చిరుత పిల్ల ఒంటరిగా కనిపించింది. కుక్కలు తరుముతుండటంతో గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. వారు చిరుత పిల్లను తన తల్లి దగ్గరికి చేరుస్తామన్నారు.
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన పార్టీకి ‘రెండు కత్తులు.. ఒక డాలు’ గుర్తు కేటాయిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందే ఆయన పార్టీకి ‘బాలసాహెబాంచి శివసేన’ అనే పేరును ఈసీ కేటాయించింది.
హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన శ్రీవారి నమూనా ఆలయంలో ఈ సేవలు కొనసాగుతాయి. భక్తులందరికీ ఆహ్వానం ఉంది.
తీసుకున్న అప్పు చెల్లించలేదని ఒక యజమాని తన దగ్గర పని చేసే కూలీలపై అమానుషానికి పాల్పడ్డాడు. 16 మంది దళితుల్ని ఒకే గదిలో బంధించి తాళం వేశాడు. దాదాపు 15 రోజులు చిత్ర హింసకు పాల్పడ్డాడు.
బెంగళూరు నగరంలోని ట్రాఫిక్ సిగ్నళ్లలో రెడ్ లైట్ మారిపోయింది. ఇప్పుడా సిగ్నల్స్ వృత్తాకారంలో కాకుండా, హార్ట్ షేపులో కనిపిస్తున్నాయి. అయితే, ఇలా కనిపించడానికి ఒక కారణం ఉంది.
రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సంస్థల మాతృ సంస్థ ‘మెటా’ను తీవ్రవాద సంస్థగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థను తీవ్రవాదా సంస్థల జాబితాలో చేర్చింది.
జిమ్‌లో ఎక్విప్మెంట్ విషయంలో ఇద్దరు మహిళలు గొడవ పడ్డారు. ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని దాడి చేసుకునేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది.
ఎవరికైనా సమస్య వస్తే దాన్ని ఎదుర్కోవడానికి కొన్నిసార్లు అందరూ ముందుకొస్తారు. అందరూ తలో చేయి వేస్తారు. తాజాగా జరిగిన సంఘటనే దీనికి నిదర్శనం. ఒక బైకుకు అంటుకున్న మంటల్ని ఆర్పేసేందుకు ఎందరు ముందుకొచ్చారో చూడండి.
ఒక బాత్రూమ్లో ఒక కమోడ్ మాత్రమే ఉంటుంది. కానీ, తమిళనాడులోని ఒక ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించి కొత్తగా నిర్మించిన బిల్డింగులో మాత్రం ఒక బాత్రూమ్లో పక్కపక్కనే రెండు కమోడ్స్ ఏర్పాటు చేశారు.
న్యూజిలాండ్ తీరంలో మూడు రోజుల వ్యవధిలోనే 500 తిమింగలాలు మరణించాయి. అక్కడి దీవుల్లోని, సముద్ర తీరంలో ఈ తిమింగలాలు మరణించి కనిపించాయి. ఇలా ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో తిమింగలాలు మరణించడం అరుదుగా జరుగుతుంది.
కేరళలో అమానుష సంఘటన జరిగింది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే నరబలి ఇవ్వాలని నమ్మి భార్యాభర్తలు, ఇద్దరు మహిళల్ని అత్యంత పాశవికంగా హత్య చేశారు. గొంతు కోసి చంపి, ముక్కలు, ముక్కలుగా నరికారు.
పాకిస్తాన్లో హిందూ బాలిక అపహరణకు గురైంది. సింధ్ ప్రావిన్స్ ప్రాంతంలోని, హైదరాబాద్‌లో ఆమె కిడ్నాపైనట్లు బాలిక తల్లిదండ్రులు తెలిపారు. హిందూ అమ్మాయిలు కిడ్నాప్ కావడం పదిహేను రోజుల్లో ఇది నాలుగోసారి.