Fight In Gym: జిమ్‌లో ఎక్విప్‌మెంట్ కోసం గొడవ… జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు.. వీడియో వైరల్

జిమ్‌లో ఎక్విప్‌మెంట్ విషయంలో ఇద్దరు మహిళలు గొడవ పడ్డారు. ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని దాడి చేసుకునేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది.

Fight In Gym: జిమ్‌లో ఎక్విప్‌మెంట్ కోసం గొడవ… జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు.. వీడియో వైరల్

Updated On : October 11, 2022 / 6:27 PM IST

Fight In Gym: జిమ్‌లో ఇద్దరు మహిళలు గొడవపడ్డ వీడియో తాజాగా వైరల్‌గా మారింది. ఓపిక, సహనం లేకపోతే అది గొడవకు దారితీస్తుంది అనేందుకు ఈ ఘటనే నిదర్శనం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రకారం.. ఒక మహిళ స్మిత్ మెషీన్ అనే ఎక్విప్‌మెంట్‌పై వర్కవుట్ చేస్తూ ఉంటుంది.

Hindu Girl: పాక్‌లో హిందూ బాలిక కిడ్నాప్.. 15 రోజుల్లో నాలుగో ఘటన

పక్కన మరో మహిళ అదే స్మిత్ మెషీన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. వర్కవుట్ చేస్తున్న మహిళ వెళ్లిపోగానే, పక్కనే ఉన్న మహిళ ఆ మెషీన్‌పై వర్కవుట్ చేసేందుకు వెళ్లింది. అయితే, అప్పుడే మరో మహిళ వెనక నుంచి వచ్చి, ఈమెను పక్కకు తోసేసి, అదే మెషీన్‌పై వర్కవుట్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. చాలా సేపు ఓపికగా ఎదురు చూసి, మెషీన్ దగ్గరకు వెళ్లిన ఆమెను వేరే మహిళ తోసేయడంతో కోపం వచ్చి, దాడికి పాల్పడుతుంది. ఇద్దరూ జుట్టు పట్టుకుని, ఒకరిపై ఒకరు దాడి చేసుకునేందుకు ప్రయత్నిస్తారు.

Kerala Women: కేరళలో నరబలి.. గొంతుకోసి ఇద్దరు మహిళల దారుణ హత్య.. డబ్బు కోసం భార్యాభర్తల దురాగతం

చుట్టుపక్కల వాళ్లు ఇద్దరినీ విడిపించి, గొడవ సద్దుమణిగేలా చేస్తారు. ప్రస్తుతం దీనికి సంబంధించి అక్కడి సీసీ కెమెరాలో రికార్డైన ఈ వీడియో వైరల్‌గా మారింది. కొద్దిసేపు ఎవరో ఒకరు ఎదురు చూస్తే, గొడవ జరగకపోయేది కదా అని నెటిజన్లు అంటున్నారు.