Home » Author »Narender Thiru
బ్యాంకు దోపిడీకి వచ్చిన దుండగుడికి మహిళా మేనేజర్ చుక్కలు చూపించింది. కత్తితో బెదిరిస్తున్నా భయపడకుండా చిన్న టూల్‌తో పోరాడింది. దీంతో దెబ్బకు అక్కడ్నుంచి పారిపోయాడు దుండగడు.
తన భార్యతో వివాహేతర సంబంధం ఉందని అనుమానంతో అన్నను కొట్టి చంపాడో తమ్ముడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్, ఘజియాబాద్ పరిధిలో ఆదివారం రాత్రి జరిగింది.
ఓఆర్ఎస్ ద్రావణాన్ని తయారు చేసింది భారతీయ వైద్యుడు డాక్టర్ దిలీప్ మహాలనబిస్. 88 ఏళ్ల వయసున్న ఆయన కోల్‌కతాలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఆదివారం కన్నుమూశారు.
చైనా సరిహద్దులోని భారత సైన్యానికి డ్రోన్ల సేవలు అందబోతున్నాయి. ఇకపై వారికి డ్రోన్ల ద్వారా సరుకుల్ని రవాణా చేస్తారు. దీనికి సంబంధించి టెండర్లను ఆర్మీ ఆహ్వానించింది. ఇవి అందుబాటులోకి వస్తే సైన్యానికి త్వరగా సరుకులు అందుతాయి.
అతివేగం ప్రాణాంతకం అనేందుకు మరో ఉదాహరణ ఈ ఘటన. ఇటీవల బీఎండబ్ల్యూ కారులోని నలుగురు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ ఘటనకు ముందు వారు తీసుకున్న వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. అందులో కారు ప్రయాణిస్తున్న వేగం చూసి నెటిజన్లు షాకవుతున్న�
ఎలన్ మస్క్ త్వరలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇప్పటికే అనేక వ్యాపారాల్లోకి అడుగుపెట్టిన మస్క్ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ వ్యాపారంపై దృష్టిపెట్టాడు. త్వరలోనే టెస్లా నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేయబోతున్నాడు.
తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఢిల్లీలో ఉన్న ఆయన ప్రస్తుతం తుగ్లక్ రోడ్డులోని నివాసంలో వైద్యులతో చికిత్స చేయించుకుంటున్నారు. తెలంగాణ ఉన్నతాధికారులను అత్యవసరంగా ఢిల్లీ రావాలని ఆదేశించారు.
పద్దెనిమిది నెలల చిన్నారిని ఇంట్లోనే వదిలేసి బయటకు వెళ్లింది ఆమె తల్లి. తిరిగొచ్చేసరికి చిన్నారి నీళ్ల బకెట్లో పడిపోయి ఉంది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే చిన్నారి మరణించిందని చెప్పారు వైద్యులు.
టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావుకు ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయనకు చెందిన రూ.80.65 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. కేసు తదుపరి విచారణ కొనసాగుతోంది.
కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్ష పదవికి ఎన్నిక జరగడానికి కొన్ని గంటల ముందు పోటీలో ఉన్న శశి థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన బదులు మల్లికార్జున ఖర్గే గెలిస్తే, ఆయనతో కలిసి పని చేసేందుకు సిద్ధమని ప్రకటించారు.
మూగ జీవిపై కర్కశం చూపించాడో దుర్మార్గుడు. నిద్రిస్తున్న కుక్కపై ఇటుక రాయి విసిరి చంపేశాడు. అనంతరం అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. ఈ వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరిపారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్ష పదవి ఎన్నిక సోమవారం జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలో రాహుల్ గాంధీ ఎక్కడ ఓటు వేస్తారనే అంశంలో సందేహాలున్నాయి. ఎందుకంటే ఆయన ‘భారత్ జోడో యాత్ర’లో భాగంగా కర్ణాటకలో పర్యటిస్తున్నారు.
పార్కు చేసి ఉన్న స్కూలు బస్సులో ఆదివారం ఒక కొండ చిలువను గుర్తించారు బస్సు సిబ్బంది. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. బస్సు వద్దకు చేరుకున్న అటవీ అధికారులు కొండ చిలువను రక్షించి, స్వాధీనం చేసుకున్నారు.
కూతురుకు తన పోలికలు లేవని ఏడాది వయసున్న చిన్నారిని హత్య చేశాడో కసాయి తండ్రి. అంతేకాదు.. భార్యనూ చంపేశాడు. ఈ ఘటన ఈ నెల 1న ఆగ్రాలో జరిగింది.
వచ్చే ఏడాది జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 150 సీట్లు గెలుస్తుందని అభిప్రాయపడ్డారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివ కుమార్. కర్ణాటక అసెంబ్లీలో 224 సీట్లు ఉన్నాయి.
పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో విశాఖపట్నంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆయన బస చేసిన హోటల్ వద్దకు అభిమానులు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ తను ఉంటున్న హోటల్ కిటికీలోంచి అభివాదం చేశారు.
లిక్కర్ స్కామ్‌లో అవినీతికి పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సీబీఐ అధికారులు ఆదివారం నోటీసులు జారీ చేశారు. సోమవారం జరిగే విచారణకు రావాలని కోరారు.
గూగుల్ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్న ఒక వ్యక్తిని డబ్బు కోసం కిడ్నాప్ చేసిందో కుటుంబం. అమ్మాయిని ఎరగా వేసి, భోపాల్ రప్పించి, బలవంతంగా పెళ్లి చేశారు. తర్వాత డబ్బు డిమాండ్ చేశారు.
విశాఖపట్నం వదిలి వెళ్లాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. స్వయంగా పవన్ ఈ నోటీసులు అందుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్ పలు కార్యక్రమాలు రద్దు చేసుకున్నారు.
కాశ్మీర్ పండిట్లపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా శనివారం ఉదయం జమ్ము-కాశ్మీర్, షోపియన్ జిల్లాలో ఒక కాశ్మీరీ పండిట్‌ను తీవ్రవాదులు కాల్చి చంపారు. తీవ్రవాదుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.