Congress President Election: రేపే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక.. రాహుల్ ఓటు వేయబోయేది అక్కడ్నుంచే
కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్ష పదవి ఎన్నిక సోమవారం జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలో రాహుల్ గాంధీ ఎక్కడ ఓటు వేస్తారనే అంశంలో సందేహాలున్నాయి. ఎందుకంటే ఆయన ‘భారత్ జోడో యాత్ర’లో భాగంగా కర్ణాటకలో పర్యటిస్తున్నారు.

Congress President Election: కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్ష పదవికి సోమవారం ఎన్నిక జరగబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం ‘భారత్ జోడో యాత్ర’లో భాగంగా పర్యటిస్తున్న రాహుల్ గాంధీ ఓటు హక్కు ఎక్కడ వినియోగించుకుంటారు అనే అంశంపై సందిగ్ధత నెలకొంది.
తాజా సమాచారం ప్రకారం రాహుల్ గాంధీ కర్ణాటక, బళ్లారిలో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఓటు వేయబోతున్నారు. కర్ణాటకలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీతోపాటు, పార్టీకి చెందిన పలువురు నేతలు కూడా బళ్లారిలో ఓటు వేయబోతున్నారు. వీళ్లంతా రాహుల్ పర్యటన కోసం ఆయన వెంటే ఉన్నారు. దాదాపు 40 మంది సభ్యులు రాహుల్‌తోపాటు ఓటు వేస్తారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఢిల్లీలోనే ఓటు వేయబోతున్నారు.
Man Kills Wife: కూతురుకు తన పోలికలు లేవని దారుణం.. భార్య, కూతురును హత్య చేసిన దుర్మార్గుడు
వివిధ రాష్ట్రాల్లో, పార్టీ కార్యాలయాల్లో ఓటింగ్ జరుగుతుంది. అక్కడ్నుంచి బ్యాలెట్ బాక్సులు ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకుంటాయి. తర్వాత అక్కడే ఈ నెల 19న కౌంటింగ్ నిర్వహించి విజేతను ప్రకటిస్తారు. ఈ ఎన్నిక కోసం మొత్తం దేశవ్యాప్తంగా 67 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలో మల్లికార్జున ఖర్గే, శశి థరూర్ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.