Kashmiri Pandit: తీవ్రవాదుల దుశ్చర్య.. కాశ్మీరీ పండిట్ కాల్చివేత.. తీవ్రవాదుల కోసం పోలీసుల గాలింపు

కాశ్మీర్ పండిట్లపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా శనివారం ఉదయం జమ్ము-కాశ్మీర్, షోపియన్ జిల్లాలో ఒక కాశ్మీరీ పండిట్‌ను తీవ్రవాదులు కాల్చి చంపారు. తీవ్రవాదుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Kashmiri Pandit: తీవ్రవాదుల దుశ్చర్య.. కాశ్మీరీ పండిట్ కాల్చివేత.. తీవ్రవాదుల కోసం పోలీసుల గాలింపు

Updated On : October 15, 2022 / 5:11 PM IST

Kashmiri Pandit: జమ్ము-కాశ్మీర్‌లో తీవ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. షోపియన్ జిల్లాలో శనివారం కాశ్మీరి పండిట్‌ను కాల్చి చంపారు. ఈ ఘటనకు పాల్పడింది తామే అని కాశ్మీర్ ఫ్రీడమ్ ఫైటర్స్ అనే తీవ్రవాద సంస్థ ప్రకటించుకుంది.

Class 9 Girl: పరీక్షలో కాపీ కొడుతుందని అనుమానం.. బాలిక దుస్తులు విప్పించిన టీచర్.. అవమానంతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

శనివారం ఉదయం పురాన్ క్రిషన్ భట్ అనే కాశ్మీరీ పండిట్ తన ఇంటి బయట ఉండగా, దుండగులు కాల్పులు జరిపారు. అనంతరం అక్కడ్నుంచి పారిపోయారు. ఈ ఘటనలో గాయాలపాలైన అతడ్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. ఘటన సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఈ ప్రాంతం మొత్తాన్ని చుట్టుముట్టి అధీనంలోకి తీసుకున్నాయి. తీవ్రవాదుల కోసం గాలిస్తున్నాయి. కాగా, ఈ ఘటనకు పాల్పడింది తామే అని కాశ్మీర్ ఫ్రీడమ్ ఫైటర్స్ అనే తీవ్రవాద సంస్థ ప్రకటించుకుంది.

Women Asia Cup 2022: మహిళల ఆసియా కప్ విజేత భారత్.. ఏడోసారి కప్పు గెలిచిన టీమిండియా

‘‘ఈరోజు షోపియన్ జిల్లాలో కాశ్మీరి పండిట్‌ను మా బృంద సభ్యులే కాల్చి చంపారు. కాశ్మీరీ పండిట్లతోపాటు స్థానికేతరులపై దాడులు చేస్తామని మేం ఎప్పుడో హెచ్చరించాం. మీరు ఎక్కడ ఉన్నా మా నుంచి తప్పించుకోలేరు. టైం వచ్చినప్పుడు నెక్స్ట్ మీరే అవ్వొచ్చు’’ అని ఆ సంస్థ తన ప్రకటనలో తెలిపింది.