Class 9 Girl: పరీక్షలో కాపీ కొడుతుందని అనుమానం.. బాలిక దుస్తులు విప్పించిన టీచర్.. అవమానంతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

విద్యార్థిని విషయంలో టీచర్ ప్రవర్తించిన తీరు ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడేలా చేసింది. పరీక్షలో బాలిక కాపీ కొడుతుందని భావించిన టీచర్ ఆమె దుస్తులు విప్పించింది. దీంతో అవమానంగా భావించిన బాలిక ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.

Class 9 Girl: పరీక్షలో కాపీ కొడుతుందని అనుమానం.. బాలిక దుస్తులు విప్పించిన టీచర్.. అవమానంతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

Class 9 Girl: ఝార్ఖండ్‌లో దారుణం జరిగింది. పరీక్షలో కాపీ కొడుతుందని అనుమానించిన టీచర్ బాలిక దుస్తులు విప్పించింది. దీంతో అవమానంగా భావించిన ఆ బాలిక ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

Boora Narsaiah Goud: టీఆర్ఎస్‌కు బూర నర్సయ్య గౌడ్ రాజీనామా.. బీజేపీలో చేరే అవకాశం?

ఈ ఘటన ఝార్ఖండ్, జంషెడ్‌పూర్ పరిధిలో గత శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక బాలికల పాఠశాలలో పరీక్ష జరుగుతోంది. ఈ సందర్భంగా ఒక 14 ఏళ్ల తొమ్మిదో తరగతి విద్యార్థిని కాపీ కొడుతోందని ఇన్విజిలేటర్ భావించింది. దీంతో చిట్టీలు ఉన్నాయనే ఉద్దేశంతో ఆమె దుస్తుల్ని విప్పించి, తనిఖీ చేసింది. క్లాస్ రూమ్‌లో అందరిముందూ దుస్తులు విప్పించడంతో బాలిక అవమానంగా భావించింది. ఇంటికి వెళ్లిన తర్వాత ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు బాలిక ఒంటిపై మంటలు ఆర్పేసి, ఆస్పత్రికి తరలించారు.

Oil Prices: పండుగల వేళ నూనెలకు పెరిగిన డిమాండ్.. ఆకాశాన్నంటుతున్న ధరలు

తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఘటనపై బాలిక నుంచి వాంగ్మూలం సేకరించారు. ప్రస్తుతం బాలిక శరీరం 80 శాతం కాలిపోయింది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.