Oil Prices: పండుగల వేళ నూనెలకు పెరిగిన డిమాండ్.. ఆకాశాన్నంటుతున్న ధరలు

పండుగల సందర్భంగా దేశవ్యాప్తంగా వంట నూనెలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. దీంతో డిమాండ్ పెరిగి, ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. సోయాబీన్, సన్ ఫ్లవర్, వేరు శనగ నూనెల ధరలు భారీగా పెరిగాయి.

Oil Prices: పండుగల వేళ నూనెలకు పెరిగిన డిమాండ్.. ఆకాశాన్నంటుతున్న ధరలు

Oil Prices: దసరా, దీపావళి పండుగల సందర్భంగా వంట నూనెలకు దేశవ్యాప్తంగా డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఫలితంగా వంట నూనెల ధరలు కూడా భారీగా పెరిగాయి. గత పదిహేను రోజుల్లోనే 15 కేజీల సోయాబీన్ టిన్ ధర రూ.250 వరకు పెరిగింది.

Boora Narsaiah Goud: టీఆర్ఎస్‌కు బూర నర్సయ్య గౌడ్ రాజీనామా.. బీజేపీలో చేరే అవకాశం?

అది కూడా హోల్‌సేల్ మార్కెట్లో. ఇక రిటైల్ మార్కెట్లో దీని ధర మరింతగా పెరిగే అవకాశం ఉంది. గత 15 రోజుల క్రితం టిన్ ధర రూ.1950 ఉండగా, ప్రస్తుతం రూ.2,200గా ఉంది. పల్లినూనె 15 కేజీల టిన్ ధర రూ.2,650 నుంచి రూ.2,750కి పెరిగింది. రైస్ బ్రాన్ ఆయిల్ 15 కేజీల టిన్ ధర ధర రూ.2,000 నుంచి రూ.2,100కు పెరిగింది. పామాయిల్ టిన్ ధర రూ.1,650 నుంచి రూ.1,700కు పెరిగింది. సన్ ఫ్లవర్ ఆయిల్ ధర రూ.2,100 నుంచి రూ.2,150కి పెరిగింది. 910 గ్రాములు లేదా లీటర్ సోయాబీన్ ఆయిల్ ధర రూ.135 నుంచి రూ.145కి పెరిగింది.

Chandrababu : వేంకటేశ్వరస్వామి వల్లే బతికి ఉన్నా.. అలిపిరి బాంబు బ్లాస్ట్ ఘటనపై చంద్రబాబు..

ప్రస్తుతం సోయాబీన్ నూనెల సరఫరా తగినంతగా ఉన్న నేపథ్యంలో లీటర్ ధర రూ.155 కంటే ఎక్కువగా పెరిగే అవకాశం లేదని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా వంట నూనెలకు డిమాండ్ పెరుగుతుందని, దీంతో ధరలు కూడా పెరుగుతాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.