Home » Author »Narender Thiru
దీపావళి సందర్భంగా కొన్ని చోట్ల ప్రజలు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందనే సంగతి తెలిసిందే. ఈ విషయంలో యూపీ ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమైంది. రాబోయే పరిస్థితికి అనుగుణంగా ఆస్పత్రుల్లో ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.
ఉత్తర ప్రదేశ్‌లో తల్లితో పాటు అమ్మవారి గుడికి వెళ్లిన ఒక వ్యక్తి బ్లేడుతో గొంతు కోసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. శరీరంపై పలు చోట్ల కోసుకోవడంతో తీవ్ర రక్తస్రావం జరిగి ప్రాణాలు కోల్పోయాడు.
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం ఇండియా-పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది. మెల్బోర్న్లో ఆదివారం మధ్యాహ్నం మ్యాచ్ ప్రారంభమవుతుంది. అయితే, ఆదివారం అక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా.
చంద్రుడిపై పరిశోధనల కోసం ఇస్రో చేపట్టిన ప్రాజెక్టు ‘చంద్రయాన్-3’. వచ్చే ఏడాది జూన్‌లో చంద్రయాన్-3కి ఉద్దేశించిన అంతరిక్ష వాహక నౌకను గగన తలంలో ప్రవేశపెట్టబోతున్నట్లు ఇస్రో ఛైర్మన్ తెలిపారు.
ఓలా సంస్థ త్వరలో మరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఎస్ 1 ఎయిర్ పేరుతో కొత్త వాహనాన్ని వచ్చే ఏడాది మార్కెట్లోకి తీసుకొస్తుంది. తాజాగా ఈ వాహనాన్ని కంపెనీ లాంఛ్ చేసింది. అయితే, డెలివరీ మాత్రం వచ్చే ఏప్రిల్‌లోనే.
అత్యాచారం పేరుతో నాటకమాడిన మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఢిల్లీ మహిళా కమిషన్ లేఖ రాసింది. ఇటీవల ఒక మహిళ నిర్భయ తరహాలో అత్యాచారానికి గురైనట్లు నాటకమాడిన సంగతి తెలిసిందే.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణానికి సంబంధించిన అనేక అంశాలు ఇంకా మిస్టరీగానే ఉన్నాయి. ఆయన విమాన ప్రమాదం నుంచి తప్పించుకుని, గుమ్ నామీ బాబాగా గడిపారని కొందరి నమ్మకం.
మనీ లాండరింగ్ కేసులో ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బెయిల్ పొడిగిస్తూ, ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల 10 వరకు ఆమె బెయిల్ పొడిగించింది.
దేశంలో కరెన్సీ నోట్లపై నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రాన్ని ముద్రించాలని అఖిల భారత హిందూ మహాసభ డిమాండ్ చేసింది. గాంధీజీ ఫొటో స్థానంలో, నేతాజీ ఫొటో ముద్రించాలని కోరింది. ఈ డిమాండ్‌ను పలువురు తప్పుబడుతున్నారు.
ఝార్ఖండ్‌లో ఒక యువతిపై పది మంది దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్కూటీపై స్నేహితుడితో కలిసి వెళ్తున్న ఆమెను కిడ్నాప్ చేసి, దారుణానికి తెగబడ్డారు. పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఒక పక్క డాలరుతో పోలిస్తే రూపాయి విలువ పడిపోతుంటే.. మరో పక్క విదేశీ మారక నిల్వలు కూడా తగ్గిపోతున్నాయి. గత వారం దేశంలో రెండేళ్ల కనిష్టానికి విదేశీ నిల్వలు తగ్గిపోయాయని ఒక నివేదిక తెలిపింది.
చిన్న పిల్లలు అమాయకత్వంతో చేసే అల్లరి పనులు నవ్వు తెప్పిస్తూ ఆసక్తికరంగా ఉంటాయి. కావాలంటే ఈ ఫన్నీ వీడియో చూడండి. ఒక బుడతడు దగ్గర్లోని కారుపై లిప్‌స్టిక్‌తో ఎలా గీతలు గీశాడో..!
అపరిచితులు ఇచ్చే ఆహార పదార్థాలు తీసుకోకూడదు అనేందుకు ఉదాహరణ తాజా ఘటన. తెలియని వ్యక్తి ఇచ్చిన కూల్ డ్రింక్ తాగిన ఆరో తరగతి బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
ఢిల్లీ పరిధిలో మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. బాలిక ఇంట్లోనే, వేరే గదిలో ఉంటున్న నిందితుడు బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.
దేశంలో పలువురు విద్వేష పూరిత, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడంపై భారత సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి వాటిపై ఏ చర్యలు తీసుకున్నారో తెలపాలని ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
అపార్టుమెంట్ పైఅంతస్థులో ఉంటున్న ఒక మహిళ తన ఇంటి అద్దాలు తుడిచేందుకు సాహసం చేసింది. పై అంతస్తు అయినా సరే.. బయటివైపు, కిటికీ గోడపై నిలబడి నిర్లక్ష్యంగా అద్దాలు తుడుస్తోంది. ఏమాత్రం పట్టుజారినా ప్రమాదమే.
అరుణాచల్ ప్రదేశ్‌లో భారత ఆర్మీకి చెందిన హెలికాప్టర్ కూలిన ఘటనలో ఐదుగురు మరణించారు. వీరిలో ఇద్దరు పైలట్లు కూడా ఉన్నారు. శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది.
అమరావతి రాజధాని అంశంపై నవంబర్ 1న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అమరావతిని రాజధాని చేయాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణ త్వరగా చేపట్టాలని ప్రభుత్వం కోరింది.
తమ కంపెనీ ఉద్యోగుల మూన్‌లైటింగ్‌కు ఐటీ సంస్థ ‘ఇన్ఫోసిస్’ అనుమతించింది. కంపెనీ మేనేజర్ల అనుమతితో మరో చోట పని చేయవచ్చని సూచించింది. అయితే, కొన్ని నిబంధనలు విధించింది.
హైదరాబాద్, బంజారాహిల్స్ పరిధిలో చిన్నారిపై లైంగిక దాడికి కారణమైన స్కూలుపై ప్రభుత్వం చర్యలకు దిగింది. డీఏవీ స్కూలు గుర్తింపు రద్దు చేస్తూ మంత్రి సబిత ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల విద్యార్థులకు ఇతర పాఠశాలల్లో సీట్లు కేటాయించాలని సూచించారు.