Netaji Subhas Chandra Bose: నేతాజీ డెత్ మిస్టరీ.. గుమ్ నామీ బాబా డీఎన్ఏ వివరాలివ్వలేమన్న కేంద్రం
నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణానికి సంబంధించిన అనేక అంశాలు ఇంకా మిస్టరీగానే ఉన్నాయి. ఆయన విమాన ప్రమాదం నుంచి తప్పించుకుని, గుమ్ నామీ బాబాగా గడిపారని కొందరి నమ్మకం.

Netaji Subhas Chandra Bose: నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణానికి సంబంధించిన అంశం 77 ఏళ్లుగా మిస్టరీగానే మిగిలింది. నేతాజీ మరణంపై అనేక అంశాలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. కొందరి నమ్మకం ప్రకారం.. నేతాజీ విమాన ప్రమాదంలో మరణించలేదని, ఆయన గుమ్ నామీ బాబా పేరుతో సాధువుగా తన చివరి రోజులు గడిపారని ఒక ప్రచారం ఉంది.
India: తగ్గుతున్న విదేశీ మారక నిల్వలు.. రెండేళ్ల కనిష్టానికి పడిపోయిన భారత విదేశీ నిల్వలు
దీనిపై నిజాలు తెలుసుకునేందుకు సయాక్ సేన్ అనే ఒక వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. అందరూ నమ్ముతున్నట్లుగా గుమ్ నామీ బాబాకు సంబంధించిన ఎలక్ట్రోఫెరోగ్రామ్ డీఎన్ఏ వివరాలు అందించాలని భారత ప్రభుత్వాన్ని కోరాడు. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో నడిచే ‘ద సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (సీఎఫ్ఎస్ఎల్)’కి సయాక్ సేన్ దరఖాస్తు చేశాడు. ఆ సంస్థ సేకరించిన డీఎన్ఏ శాంపిల్ వివరాలు ఇవ్వాలని కోరాడు. అయితే, ఈ వివరాలు వెల్లడించేందుకు కేంద్రం నిరాకరించింది. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 8(1) ప్రకారం.. దేశ సమగ్రత, భద్రత, వ్యూహాత్మక, ఆర్థిక పరమైన అంశాలకు భంగం కలిగించే వివరాల్ని వెల్లడించడం కుదరదని, దీని ప్రకారం నేతాజీగా నమ్ముతున్న గుమ్ నామీ బాబీ డీఎన్ఏ వివరాల్ని కూడా వెల్లడించలేమని ప్రభుత్వం తెలిపింది.
Jharkhand: స్కూటీపై వెళ్తున్న యువతి కిడ్నాప్… అత్యాచారానికి పాల్పడ్డ పది మంది
ఈ వివరాలు వెల్లడైతే దేశ సమగ్రతకు భంగం వాటిల్లడమే కాకుండా, ఇతర దేశాలతో సంబంధాలు దెబ్బ తింటాయనే కారణంతో ఈ వివరాలు వెల్లడించేందుకు కేంద్రం నిరాకరించిందని సయాక్ సేన్ అన్నాడు. సుభాష్ చంద్రబోస్ మరణానికి సంబంధించిన వివరాల ప్రకారం ఆయన 1945, ఆగష్టు 18న జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఆ విమాన ప్రమాదం నుంచి ఆయన తప్పించుకున్నారని, ఆ తర్వాత రహస్య జీవితం గడిపారని చాలా మంది నమ్ముతున్నారు.