India: తగ్గుతున్న విదేశీ మారక నిల్వలు.. రెండేళ్ల కనిష్టానికి పడిపోయిన భారత విదేశీ నిల్వలు

ఒక పక్క డాలరుతో పోలిస్తే రూపాయి విలువ పడిపోతుంటే.. మరో పక్క విదేశీ మారక నిల్వలు కూడా తగ్గిపోతున్నాయి. గత వారం దేశంలో రెండేళ్ల కనిష్టానికి విదేశీ నిల్వలు తగ్గిపోయాయని ఒక నివేదిక తెలిపింది.

India: తగ్గుతున్న విదేశీ మారక నిల్వలు.. రెండేళ్ల కనిష్టానికి పడిపోయిన భారత విదేశీ నిల్వలు

India: ఒక పక్క రూపాయి విలువ పడిపోతుంటే, మరో పక్క దేశంలో విదేశీ మారక నిల్వలు కూడా తగ్గిపోతున్నాయి. అక్టోబర్ 14 నాటికి దేశంలో విదేశీ మారక నిల్వలు 528.367 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది రెండేళ్ల కనిష్ట స్థాయి.

Notice to Pawan kalyan: పవన్ కల్యాణ్ ‘మూడు పెళ్లిళ్ల’ వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్.. నోటీసులు జారీ

గత వారమే దాదాపు 4.5 బిలియన్ డాలర్ల మారక నిల్వల్ని భారత్ కోల్పోయింది. అంతకుముందు వారం 532.868 బిలియన్ డాలర్ల మారక నిల్వలు ఉండేవి. ఆర్బీఐ డాటా ఆధారంగా వెల్లడైన వివరాలివి. మరోవైపు బంగారు నిల్వల విలువ కూడా తగ్గిపోయింది. గత వారం బంగారు నిల్వలు 1.5 బిలియన్ డాలర్లు తగ్గి, 37.453 బిలియన్ డాలర్ల వద్ద ముగిసింది. ఇక ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్ నుంచి భారత్ ఉపసంహరించుకునే నిధుల విలువ కూడా తగ్గింది. ఈ విలువ 149 మిలియన్ డాలర్లు తగ్గి, 17.433 బిలియన్ డాలర్ల వద్ద నిలిచింది. కొన్ని నెలలుగా దేశంలో విదేశీ మారక నిల్వలు తగ్గిపోతున్నాయి.

Balakrishna: కెరీర్‌లో తొలి యాడ్ చేస్తున్న బాలయ్య.. ఏమిటంటే?

డాలర్‌తో రూపాయి విలువ పడిపోతుండటంతో దీన్ని నివారించేందుకు ఆర్బీఐ తీసుకుంటున్న చర్యల ఫలితంగా ఈ పరిస్థితి తలెత్తుతోంది. రూపాయి విలువ పెంచేందుకు డాలర్లను ఆర్బీఐ విక్రయిస్తోంది. ఇటీవలి కాలంలో రూపాయి విలువ భారీగా పతనమైంది. అత్యధిక కనిష్టానికి చేరుకుంది. డాలర్‌తో రూపాయి విలువ 83కు చేరింది. మొత్తంగా ఈ ఏడాది రూపాయి విలువ 11-12 శాతం పడిపోయింది.