Notice to Pawan kalyan: పవన్ కల్యాణ్ ‘మూడు పెళ్లిళ్ల’ వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్.. నోటీసులు జారీ
ఎవరి జీవితంలోనయినా మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వస్తే అది కచ్చితంగా వ్యతిరేక అంశమేనని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. మహిళలను ఉద్దేశించి స్టెప్నీ అనే పదం ఉపయోగించడం తీవ్ర ఆక్షేపనీయమని చెప్పారు. మహిళాలోకానికి క్షమాపణలు చెప్పాలని, పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఏపీ మహిళా కమిషన్ ఈ నోటీసులు జారీ చేస్తోందని అన్నారు.

Pawan Kalyan spoke about his three marriages
Notice to Pawan kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల చేసిన మూడు పెళ్లిళ్ల వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయింది. పవన్ కి నోటీసులు ఇచ్చింది. పవన్ వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. మూడు పెళ్లిళ్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, మహిళాలోకానికి క్షమాపణలు చెప్పాలని పేర్కొన్నారు.
పవన్ వ్యాఖ్యలు ఇటీవల మూడు పెళ్లిళ్లపై చేసిన వ్యాఖ్యలు సమాజంలో పెద్ద దుమారాన్ని రేపాయని అన్నారు. భరణం ఇస్తే భార్యను వదిలించుకోవచ్చనేలా పవన్ మాట్లాడారని నోటీసులో ఆమె పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు విని మహిళా లోకం షాక్ అయిందని అన్నారు.
ఎవరి జీవితంలోనయినా మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వస్తే అది కచ్చితంగా వ్యతిరేక అంశమేనని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. మహిళలను ఉద్దేశించి స్టెప్నీ అనే పదం ఉపయోగించడం తీవ్ర ఆక్షేపనీయమని చెప్పారు. మహిళాలోకానికి క్షమాపణలు చెప్పాలని, పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఏపీ మహిళా కమిషన్ ఈ నోటీసులు జారీ చేస్తోందని అన్నారు.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..