Balakrishna: కెరీర్‌లో తొలి యాడ్ చేస్తున్న బాలయ్య.. ఏమిటంటే?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ చిత్రానికి ‘వీరసింహారెడ్డి’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను చిత్ర యూనిట్ తాజాగా ఫిక్స్ చేయడంతో, ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. బాలయ్య ఇప్పటికే హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షో రెండో సీజన్‌ను ఇటీవల ప్రారంభించాడు. ఇక ఇదిలా ఉంటే, తాజాగా బాలయ్య తన కెరీర్‌లో తొలిసారి ఓ కమర్షియల్ యాడ్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

Balakrishna: కెరీర్‌లో తొలి యాడ్ చేస్తున్న బాలయ్య.. ఏమిటంటే?

Balakrishna: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ చిత్రానికి ‘వీరసింహారెడ్డి’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను చిత్ర యూనిట్ తాజాగా ఫిక్స్ చేయడంతో, ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి బరిలో ఈ సినిమా రిలీజ్ అవుతుండటంతో బాలయ్య మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.

Balakrishna: బాలీవుడ్ భరతం పట్టేందుకు రెడీ అవుతున్న బాలయ్య..?

అయితే బాలయ్య ఇప్పటికే హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షో రెండో సీజన్‌ను ఇటీవల ప్రారంభించాడు. ఇక ఇదిలా ఉంటే, తాజాగా బాలయ్య తన కెరీర్‌లో తొలిసారి ఓ కమర్షియల్ యాడ్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో సాయిప్రియ కన్‌స్ట్రక్షన్ గ్రూప్ కోసం తెరకెక్కించే ఓ యాడ్‌లో బాలయ్య తొలిసారి కనిపించబోతున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఇక యాడ్ రంగంలోకి తొలి అడుగు పెడుతున్న బాలయ్యకు ఈ సందర్భంగా శ్రేయాస్ మీడియా కృతజ్ఞతలు తెలిపింది.

Balakrishna: NBK107 క్రేజీ అప్డేట్.. అధికారికంగా ప్రకటించిన చిత్ర నిర్మాతలు!

మొత్తానికి బాలయ్య సినిమాలు, హోస్ట్‌గా అన్‌స్టాపబుల్ టాక్ షోలతో పాటు తాజాగా యాడ్ రంగంలోనూ అడుగుపెడుతుండటంతో నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అన్ని రంగాల్లోనూ బాలయ్య తన సత్తా చాటుతుండటంతో అభిమానులు గర్వంతో కాలర్ ఎగరేస్తున్నారు. మరి బాలయ్య చేస్తున్న ఈ తొలి యాడ్ ఎలా ఉండబోతుందో చూడాలి.