Daredevil Woman: కిటికీ అద్దాలు తుడిచేందుకు మహిళ సాహసం.. వీడియో చూస్తే ఒళ్లు జలధరించాల్సిందే!

అపార్టుమెంట్ పైఅంతస్థులో ఉంటున్న ఒక మహిళ తన ఇంటి అద్దాలు తుడిచేందుకు సాహసం చేసింది. పై అంతస్తు అయినా సరే.. బయటివైపు, కిటికీ గోడపై నిలబడి నిర్లక్ష్యంగా అద్దాలు తుడుస్తోంది. ఏమాత్రం పట్టుజారినా ప్రమాదమే.

Daredevil Woman: కిటికీ అద్దాలు తుడిచేందుకు మహిళ సాహసం.. వీడియో చూస్తే ఒళ్లు జలధరించాల్సిందే!

Updated On : October 21, 2022 / 6:46 PM IST

Daredevil Woman: అపార్టుమెంట్లలో ఉండేవాళ్లు ఇల్లు శుభ్రం చేసుకునేటప్పుడు కిటికీ అద్దాలు తుడవాలంటే లోపలి నుంచే తుడవాలి. పై అంతస్తుల్లో ఉండేవాళ్లకు బయటకు వెళ్లి శుభ్రం చేయడం సాధ్యం కాదు. అందులోనూ బయటివైపు ఉండే కిటికీ అద్దాల్ని, బయటి నుంచి తుడవడం అసాధ్యం.

Pawan Kalyan: విశాఖలో మంత్రులపై దాడి కేసు.. జనసేన నేతలకు బెయిల్.. హర్షం వ్యక్తం చేసిన పవన్

కానీ, ఒక మహిళ మాత్రం తన ఇంటి బయటివైపు ఉన్న కిటికీ అద్దాలు తుడిచేందుకు సాహసమే చేసింది. ఒక అపార్టుమెంట్లో, పై అంతస్తులో ఉంటున్న మహిళ గోడ బయటివైపు నిలబడి కిటికీ అద్దాలు తుడిచింది. కిటికీ గోడ అంచులపై నిలబడి, కిటికీ ఊచల్ని మాత్రమే పట్టుకుని అద్దాలు తుడుస్తున్న ఆమెను చూస్తే ఒళ్లు జలధరిచడం ఖాయం. ఎందుకంటే ఏమాత్రం పట్టుజారినా కింద పడి ప్రాణాలు పోతాయి. అయినా, ఆమె ఇవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసింది.

ఎదురింట్లో ఉన్న వ్యక్తి ఎవరో ఈ దృశ్యాన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమె సాహసానికి ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‪గా మారింది. కావాలంటే మీరూ చూడండి.