Home » Author »Narender Thiru
ఢిల్లీలో టపాసులపై నిషేధం విధిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఎంపీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ జరిగింది.
తెలంగాణ సీఐడీ డీజీ గోవింద్ సింగ్, ఆయన సతీమణి ప్రయాణిస్తున్న కారు రాజస్థాన్‌లో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో గోవింద్ సింగ్ సతీమణి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, గోవింద్ సింగ్ గాయాలతో బయటపడ్డారు.
వాట్సాప్ గ్రూప్‌లో ఇప్పుడున్న సభ్యుల సంఖ్య త్వరలో రెట్టింపు కాబోతుంది. మరికొద్ది రోజుల్లో ఒక గ్రూపులో 1024 మంది సభ్యుల వరకు చేరవచ్చు. దీనితోపాటు మరిన్ని కొత్త ఫీచర్స్ త్వరలో రానున్నాయి.
బీజేపీ జాతీయ నాయకత్వానికి ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు సమాధానం పంపారు. తను పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నట్లు లేఖలో పేర్కొన్నారు.
దాదాపు ఏడు దశాబ్దాలుగా కేరళలోని అనంతపద్మనాభ స్వామి ఆలయంలోని కొలనులో ఉంటున్న బబియా అనే మొసలి కన్నుమూసింది. ఈ మొసలి పూర్తిగా శాకాహారి.
టూర్ కోసం వచ్చిన అమ్మాయిలు బసే చేసే డామిట్రీలో రహస్యంగా సీసీ కెమెరా ఏర్పాటు చేశాడు ఓనర్. ఇది తెలియన అమ్మాయిలు అక్కడే దుస్తులు మార్చుకున్నారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై సోమవారం కోర్టు విచారణ జరిపింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించబోమని కోర్టు తెలిపింది.
చెరువులో మునిగిపోతున్న చెల్లిని కాపాడేందుకు ప్రయత్నించిన అక్క అదే నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయింది. చెల్లి సురక్షితంగా బయటపడింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం జిల్లాలో జరిగింది.
యాపిల్ వాచ్‌లో హెల్త్ ఫీచర్స్ అద్భుతంగా పని చేస్తాయి. ఈ వాచ్ హార్ట్ ఎటాక్‌ను ముందే గుర్తించడం ద్వారా చాలా మంది ప్రాణాల్ని కాపాడటంలో సాయపడింది. తాజాగా ఈ వాచ్ మరో ఘనత సాధించింది. ప్రెగ్నెన్సీని ముందుగానే గుర్తించింది.
గనుల అక్రమ తవ్వకాల కేసుకు సంబంధించి బెయిల్ నిబంధనలు సడలించాలని కోరుతూ గాలి జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
జొమాటో డెలివరీ బాయ్‌ను హౌజింగ్ సొసైటీలోకి అనుమతించే విషయంలో సెక్యూరిటీ గార్డుకు, డెలివరీ బాయ్‌కు మధ్య గొడవ జరిగింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికాపై ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. యువ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్ సెంచరీ సాధించి, భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.ఇషాన్ కిషన్ 93 పరుగులు సాధించాడు.
మునుగోడు ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా సాగుతోంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ ఈసీకి ఫిర్యాదు చేసింది.
ఆంధ్రప్రదేశ్, పాలకొల్లులో బస్సులో ఒక ప్రయాణికుడు వీరంగం సృష్టించాడు. గల్ఫ్ వెళ్లాలనుకున్న అతడి వీసా గడువు ముగిసిపోయింది. దీంతో ప్రయాణం నిలిచిపోయింది. ఈ కారణంతో అసహనానికి గురయ్యాడు.
అసోం రాష్ట్రంలో రైనోలు చాలా ప్రత్యేకమైనవి. వాటిని సంరక్షించేందుకు అక్కడి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. తాజాగా ఒక రైనోను ట్రక్కు ఢీకొంది. అయితే, ఈ ఘటనలో రైనో సురక్షితంగా బయటపడింది. దీనిపై సీఎం స్పందించారు.
రాజస్థాన్, అజ్మేర్ జిల్లాలో దళిత మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. నిందితుడు ఆమె కుటుంబానికి తెలిసిన పూజారే కావడం గమనార్హం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
దేశంలో మరోసారి డెంగీ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందులో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కేసుల సంఖ్య భారీ స్థాయిలో పెరిగాయి. గత నెలలో ఏకంగా 20,000కు పైగా కేసులు నమోదయ్యాయి.
భార్యపై వివాహేతర సంబంధం విషయంలో అనుమానంతో ఉన్న భర్త.. తన కోపాన్ని చిన్నారి కూతురుపై చూపించాడు. నాలుగేళ్ల కూతురుపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలపాలైన చిన్నారి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
ఢిల్లీలో శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు నిర్విరామంగా వర్షం కురిసింది. 24 గంటలపాటు ఎడతెరిపి లేకుండా వర్షం పడటం 2007 తర్వాత ఇదే మొదటిసారి. మరోవైపు కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు లేదు.
ఐపీఎల్లో ఆడటం వల్ల ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడికి గురువుతున్నట్లు ప్రచారం జరిగే సంగతి తెలిసిందే. దీనిపై మాజీ క్రికెట్ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించారు. అంత ఒత్తిడి అనిపిస్తే ఐపీఎల్లో ఆడటం మానేయాలని ఆయన సలహా ఇచ్చారు.