Ind vs Sa: రెండో వన్డేలో సౌతాఫ్రికాపై భారత్ ఘన విజయం.. సెంచరీ సాధించిన శ్రేయస్ అయ్యర్
సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికాపై ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. యువ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్ సెంచరీ సాధించి, భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.ఇషాన్ కిషన్ 93 పరుగులు సాధించాడు.

Ind vs Sa: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికాపై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 279 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మరో 25 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది.
Rhino: అసోంలో రైనోను ఢీకొన్న ట్రక్కు.. స్పందించిన సీఎం.. ఏమన్నారంటే
యువ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్ సెంచరీ సాధించి, భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొదట బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి, 278 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్లలో మార్‌క్రమ్, హెండ్రిక్స్ రాణించారు. మార్‌క్రమ్ అత్యధికంగా 79 పరుగులు సాధించగా, హెండ్రిక్ 74 పరుగులు చేశాడు. తర్వాత మిల్లర్ 35 పరుగులు, క్లాసెన్ 30 పరుగులు, మలాన్ 25 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలింగ్‌లో మహ్మద్ సిరాజ్ అద్భుతంగా రాణించి, పది ఓవర్లకుగాను 38 పరుగులు ఇచ్చి, మూడు వికెట్లు తీశాడు. తర్వాత సుందర్, షాబాజ్ అహ్మద్, కుల్‌దీప్ యాదవ్, ఠాకూర్ తలో వికెట్ తీశారు.
తర్వాత 279 పరుగులు లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్ శిఖర్ ధావన్ 13 పరుగులే చేసి ఔటయ్యాడు. తర్వాత శుభ్‌మన్ గిల్ 28 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత ఇషాన్ కిషన్ 93 పరుగులు సాధించి అద్భుతంగా రాణించి, ఔటయ్యాడు. అతడికి శ్రేయస్ అయ్యర్ అండగా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ 111 బంతుల్లో 113 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. సంజూ శాంసన్ 30 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.