Rhino: అసోంలో రైనోను ఢీకొన్న ట్రక్కు.. స్పందించిన సీఎం.. ఏమన్నారంటే

అసోం రాష్ట్రంలో రైనోలు చాలా ప్రత్యేకమైనవి. వాటిని సంరక్షించేందుకు అక్కడి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. తాజాగా ఒక రైనోను ట్రక్కు ఢీకొంది. అయితే, ఈ ఘటనలో రైనో సురక్షితంగా బయటపడింది. దీనిపై సీఎం స్పందించారు.

Rhino: అసోంలో రైనోను ఢీకొన్న ట్రక్కు.. స్పందించిన సీఎం.. ఏమన్నారంటే

Rhino: రైనో (ఖడ్గ మృగం)లకు అసోం ఆవాసంగా ఉంది. ఇక్కడే రైనోలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా అక్కడి కజిరంగా నేషనల్ పార్కు పరిధిలోనే రైనోలు అధికంగా ఉంటాయి. వాటి సంరక్షణ కోసం అసోం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

Rajasthan: దళిత యువతిని బంధించి సామూహిక అత్యాచారం

ప్రత్యేక కారిడార్ కూడా ఏర్పాటు చేసింది. అయితే, ఇటీవల హల్దిబరి యానిమల్ కారిడార్ పరిధిలోని రోడ్డుపై, గుహవటి నుంచి జోర్హాట్ వెళ్తున్న ఒక ట్రక్కు రైనోను ఢీకొంది. ఆ రైనో రోడ్డు దాటుతుండగా, ఈ ఘటన జరిగింది. అయితే, అదృష్టవశాత్తు రైనోకు పెద్దగా గాయాలు కాలేదు. అది సురక్షితంగా బయటపడింది. ఈ ఘటన అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డైంది. దీనికి సంబంధించిన వీడియోను అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తన సోషల్ మీడియాలో విడుదల చేశారు.

దీనిపై హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ ‘‘రైనోలు మాకెంతో ప్రత్యేకమైనవి. వాటి స్థావరాల్లో ఎలాంటి ఉల్లంఘనలను అనుమతించబోం. అయితే, తాజా ఘటనలో రైనో క్షేమంగా బయటపడింది. దీనికి కారణమైన ట్రక్కుకు జరిమానా విధించాం. ఈ దశలో జంతువుల్ని సంరక్షించేందుకు 32 కిలోమీటర్ల ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేస్తున్నాం’’ అని ప్రకటించారు.