Home » Author »Narender Thiru
దేశంలోని లగ్జరీ ట్రైన్లలో ఒకటైన ‘ప్యాలెస్ ఆన్ వీల్స్’. అత్యాధునిక సౌకర్యాలున్న ఈ రైలు కోవిడ్ కారణంగా ప్రయాణానికి దూరంగా ఉంది. రెండేళ్ల తర్వాత ఈ రైలు శనివారం తిరిగి ప్రారంభమైంది.
భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం భర్త హత్యకు దారి తీసింది. ఒక మహిళ ఆవేశంతో తన భర్త ప్రాణాలే తీసింది. భర్త మర్మాంగాన్ని కోసి, ఆపై కత్తితో పొడిచి హత్య చేసింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ఈ ఆసక్తికర ఘటన దుర్గా నవరాత్రోత్సవాల సందర్భంగా కోల్‌కతాలో శనివారం జరిగింది.
‘మహీంద్రా అండ్ మహీంద్రా’ సంస్థ నుంచి తాజాగా విడుదలైంది ‘స్కార్పియో-ఎన్’. గత నెల నుంచి ఈ వాహనాల డెలివరీ ప్రారంభమైంది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం వీటి డెలివరీకి మరో రెండేళ్లు పడుతుంది.
మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేశాడు ఒక నిందితుడు. తర్వాత ఆమె గొంతు కోసి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. తర్వాత బ్యాగులో కుక్కి, అడవిలో పడేసి వచ్చాడు. అయినా, ఆ బాలిక తిరిగి ఇంటికి చేరుకుంది.
ప్రముఖ గ్లోబల్ పిజ్జా మేకింగ్ బ్రాండ్ డోమినోస్ నుంచి డెలివరీ అయిన ఒక పిజ్జాలో వినియోగదారుడికి గాజు ముక్కలు కనిపించాయి. ఈ విషయాన్ని అతడు పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. దీనిపై వారేం అన్నారంటే..
కొత్తగా కొని ఇంటికి తెచ్చిన కారు పాపం ఆ యజమానికి చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. అపార్ట్మెంట్లోకి వచ్చిన మొదటి రోజే ప్రమాదానికి గురైంది. పార్కు చేసి ఉంచిన బైకులపైకి దూసుకెళ్లింది.
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో నలుగురు మరణించారు. మరో 16 మంది గాయపడ్డారు. అక్రమంగా ఎల్పీజీ సిలిండర్ నుంచి గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగింది.
చిన్నారితోసహా తొమ్మిది మంది ప్రాణాల్ని బలిగొన్న పులిని అధికారులు మట్టుబెట్టారు. ప్రభుత్వ అనుమతితో పులిని చంపేశారు. ఈ ఘటన శనివారం బిహార్‌లో జరిగింది.
ఇటీవలే ఘనంగా ప్రారంభమైన ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ రైలు మరోసారి నిలిచిపోయింది. ఇటీవలే గేదె ఢీకొనడం వల్ల ఆగిపోయిన ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ రైలు ఈ సారి సాంకేతిక సమస్య కారణంగా నిలిచిపోయింది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడారు. మంగళవారం మోదీ, జెలెన్స్కీ.. పలు అంశాలపై చర్చించినట్లు ప్రభుత్వం తెలిపింది.
వెన్ను నొప్పి కారణంగా టీ20 ప్రపంచకప్‌కు బుమ్రా దూరం కానున్నాడని బీసీసీఐ ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ నిరాశలో మునిగిపోయారు. దీనిపై బుమ్రా ట్విట్టర్ వేదికగా స్పందించాడు.
ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ఇండోర్ వేదికగా మూడో టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన రోహిత్ సేన బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఒక వికెట్ కోల్పోయింది.
నేషనల్ పవర్ గ్రిడ్ ఫెయిల్ కావడంతో బంగ్లాదేశ్ దాదాపు పూర్తిగా అంధకారంలోనే ఉంది. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల సమయం నుంచి దేశంలో కరెంటు పోయింది. కరెంటు పునరుద్ధరించేందుకు ఇంకా చాలా సమయం పడుతుందని అధికారులు అంటున్నారు.
దేశంలో 5జీ సేవలు రేపే ప్రారంభం కాబోతున్నాయి. దసరా సందర్భంగా బుధవారం నుంచి 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి. మొదటగా దేశంలోని నాలుగు నగరాల్లో ఈ సేవలు ప్రారంభమవుతాయి.
సోషల్ మీడియాను అధికంగా వాడే యువత త్వరగా డిప్రెషన్ బారిన పడతారని తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా 18-30 ఏళ్ల యువత డిప్రెషన్ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
కుక్కలు, గాడిదల్ని పాకిస్తాన్ నుంచి కొనేందుకు చైనా ఆసక్తి చూపిస్తోంది. దీనికి కారణం ఉంది. ఈ జంతువుల చర్మం నుంచి తయారయ్యే ఒక పదార్థం కోసమే ఈ నిర్ణయం తీసుకుంది. ఇది ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్‌కు ఉపయోగపడుతుంది.
చార్జింగ్ కేబుల్ కష్టాలకు చెల్లుచీటీ పాడేలా కొత్త చట్టం తీసుకొచ్చింది యురోపియన్ యూనియన్. ఇకపై ఈయూ పరిధిలో విక్రయించే ప్రతి గ్యాడ్జెట్‌ను టైప్-సి కేబుల్‌కు అనుగుణంగానే తయారు చేయాలి. దీనివల్ల ఒకే కేబుల్‌ను అన్ని డివైజ్‌లకు వాడుకోవచ్చు.
ఫిజిక్స్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతిని కమిటీ మంగళవారం ప్రకటించింది. ఈ సారి ముగ్గురికీ కలిపి నోబెల్ ప్రకటించింది. అలియన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్.క్లాజర్, ఆంటోన్ జెలింగర్ అనే ముగ్గురు సంయుక్తంగా నోబెల్ విజేతగా నిలిచారు.
ఉత్తరాఖండ్, హిమపాతంలో 29 మంది పర్వతారోహకులు చిక్కుకుపోయారు. వీరిని రక్షించేందుకు అక్కడి అధికారయంత్రాంగం ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకు 8 మందిని రక్షించినట్లు సమాచారం.