LPG Cylinder Blast: ఎల్పీజీ సిలిండర్ పేలి నలుగురు మృతి.. 16 మందికి గాయాలు
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో నలుగురు మరణించారు. మరో 16 మంది గాయపడ్డారు. అక్రమంగా ఎల్పీజీ సిలిండర్ నుంచి గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగింది.

LPG Cylinder Blast: రాజస్థాన్‌లో దారుణం జరిగింది. ఎల్పీజీ సిలిండర్ పేలడంతో నలుగురు మరణించారు. మరో 16 మంది గాయపడ్డారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్, మాగ్రా పునిలా ఏరియాలో ఉన్న ఒక రెసిడెన్షియల్ కాలనీలో శనివారం జరిగింది.
Tiger Killed: 9 మందిని బలిగొన్న పులి.. వేటాడి చంపిన అధికారులు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్రమంగా ఎల్పీజీ గ్యాస్‌ను కొందరు ఒక సిలిండర్ నుంచి మరో సిలిండర్‌లోకి నింపుతుండగా ఈ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి నలుగురు సజీవ దహనమయ్యారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసు అధికారులు మృతదేహాల్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టమ్ కోసం తరలించారు. క్షతగాత్రులను మహాత్మా గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.