Home » Author »Narender Thiru
రంగారెడ్డి జిల్లాలో ఈత సరదాకు నలుగురు చిన్నారులు బలయ్యారు. చెరువులో మునిగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆదివారం జరిగింది.
హైదరాబాద్‌లో భారీ పేలుళ్ల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలపై దాడులు, పేలుళ్లకు కుట్ర పన్నిన మహమ్మద్ జావిద్ అనే నిందితుడితోపాటు, మరికొంతమంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రేకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన తనయుడు ఆదిత్య థాక్రే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి చెందిన 3,000 మంది కార్యకర్తలు షిండే క్యాంపులో చేరారు.
‘స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 అవార్డుల జాబితా’ను కేంద్రం శనివారం విడుదల చేసింది. పెద్ద నగరాల జాబితాలో ఇండోర్ అతి శుభ్రమైన నగరంగా మొదటి స్థానంలో నిలిచింది. అతి శుభ్రమైన రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది.
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైకి వ్యతిరేకంగా రూపొందించిన ‘పేసీఎం’ టీ షర్ట్ ధరించాడో కాంగ్రెస్ కార్యకర్త. ఈ కారణంతోనే అతడ్ని పోలీసులు అరెస్టు చేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ స్థాపించబోయే జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారైంది. పార్టీ పేరును కూడా కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ ప్రకటన, కొత్త ఆఫీసు ప్రారంభ ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ అంశంపై ఆదివారం ప్రగతి భవన్లో టీఆర్ఎస్ నేతలతో క
ముంబైకు చెందిన పదమూడేళ్ల బాలుడిని అభినందిస్తూ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుల్లో ఒకరైన బిల్‌గేట్స్ ట్వీట్ చేశారు. అన్షుల్ భట్ అనే బాలుడు ‘వరల్డ్ యూత్ ట్రాన్స్‌నేషనల్ ఛాంపియన్షిప్స్’ గెలిచినందుకుగాను ఈ ట్వీట్ చేశారు.
సీఏఏ వ్యతిరేక నిరసనల సందర్భంగా ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసినందుకుగాను, నష్టపరిహారంగా రూ.57 లక్షలు చెల్లించాలని 60 మంది ఆందోళనకారులకు ఉత్తర ప్రదేశ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
మహిళల ఆసియా కప్ ప్రారంభ మ్యాచ్‌లో భారత్ అదరగొట్టింది. శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో 41 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. భారత బ్యాటింగ్‌లో జెమీమా రోడ్రిగ్స్ 76 పరుగులు సాధించి భారత విజయంలో కీలక పాత్ర పోషించింది.
కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశి థరూర్ పోటీ పడుతున్నారు. శనివారంతో అధ్యక్ష పదవికి నామినేషన్ల ప్రక్రియ పూర్తైంది. ఈ నెల 8 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. ఈ నెల 17న ఎన్నిక జరుగుతుంది.
ఇటీవలే దేశంలోకి వచ్చిన చీతాల్లో ఆశా అనే ఆడ చీతా గర్భంతో ఉన్నట్లు సమాచారం. ఇదే నిజమైతే దేశంలో ఒక చీతా జన్మించడం ఏడు దశాబ్దాల తర్వాత మొదటిసారి అవుతుంది. క్రమంగా చీతాల సంఖ్య పెరుగుతుంది.
జీఎస్టీ వసూళ్లలో గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఏ ఏడాది సెప్టెంబర్‌లో 26 శాతం వృద్ధి నమోదైంది. ఏకంగా సెప్టెంబర్‌లో రూ.1,47,686 కోట్ల జీఎస్టీ వసూలైంది. ఈ స్థాయిలో జీఎస్టీ వసూలు కావడం వరుసగా ఇది ఏడోసారి.
ఇండియన్ స్టార్ క్రికెటర్లు ఎమ్మెస్ ధోని, విరాట్ కోహ్లీలకు టీవీ రేటింగులను ప్రభావితం చేయగల శక్తి ఉందన్నాడు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ గ్రేమ్ స్వాన్. వాళ్లు సరిగ్గా ఆడకుంటే టీవీ రేటింగులు పడిపోతాయని స్వాన్ అన్నాడు.
ఏపీలోని పెనుగొండలో ఉన్న వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. కారణం.. ఇక్కడ దాదాపు రూ.6 కోట్ల విలువైన బంగారు, వెండి నగలతోపాటు, కరెన్సీ నోట్లతో ఆలయాన్ని అలంకరించారు.
జంట నగరాల్లో కొత్త ట్రాఫిక్ రూల్స్ అమలుకాబోతున్నాయి. ఇప్పటికే ఉన్న నిబంధనల్ని మరింత కఠినంగా ట్రాఫిక్ పోలీసులు అమలు చేయబోతున్నారు. సోమవారం నుంచి ఈ రూల్స్ అమల్లోకి వస్తాయి.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలో మత సామరస్యం వెల్లివిరిసింది. ముస్లింలు అధికంగా ఉండి, హిందూ కుటుంబం ఒకటే ఉన్న కాలనీలో ముస్లింలు దుర్గా మాత పూజలో పాల్గొంటున్నారు. హిందూ కుటుంబంతోపాటు పూజలు నిర్వహిస్తున్నారు.
పంజాబ్ సీఎం భగవంత్ మన్పై ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వీఐపీ కల్చర్‌ను అంతం చేస్తామని ప్రకటించిన ఆప్, ఆ పార్టీ సీఎం.. ఇప్పుడు ఏకంగా 42 వాహనాలను కాన్వాయ్ కోసం వాడటమేంటని కాంగ్రెస్ ప్రశ్నించింది.
ఆండ్రాయిడ్ ఫోన్లలో త్వరలో మరో కొత్త అప్డేట్ రానుంది. ‘టెక్స్ట్ టు స్పీచ్’ ఫీచర్లో మరిన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. కొత్త గొంతులు వినిపించబోతున్నాయి. మొత్తం 67 భాషల్లో 421 రకాల కొత్త గొంతులు వినిపిస్తాయి.
ఇటీవల సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ రేప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మైనర్లు అయిన ఐదుగురు నిందితుల్లో నలుగురిని మేజర్లుగా గుర్తిస్తూ జువైనల్ జస్టిస్ బోర్డు నిర్ణయం తీసుకుంది.
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను ‘జాతి పిత’గా అభివర్ణించాడు ఒక ముస్లిం మత గురువు. ఇదే ఆయనకు ఇప్పుడు చిక్కులు తెచ్చిపెడుతోంది. మోహన్ భగవత్‌ను పొగిడినందుకుగానూ, ఆ మత గురువును చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు.