Home » Author »Narender Thiru
మైసూరు రాజవంశానికి చెందిన ఒక మహిళ పాదాలకు నమస్కారం చేశారు ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి సతీమణి సుధా మూర్తి. అయితే, దీనిపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ పనిని విమర్శిస్తున్నారు.
దేశవ్యాప్తంగా పీఎఫ్ఐ సంస్థపై ఎన్ఐఏ దాడులు కొనసాగుతున్నాయి. మంగళవారం జరిపిన దాడుల్లో దాదాపు 200 మందిని అధికారులు అరెస్టు చేశారు. ఎనిమిది రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు చేస్తున్నారు.
హిజాబ్‌ను వ్యతిరేకిస్తూ ఇరాన్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మహిళలు రోడ్లపైకి చేరి హిజాబ్‌ను తగలబెడుతున్నారు. దీంతో ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి అక్కడి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో 75 మంది మరణించారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు షాక్ ఇచ్చాడు. అమెరికా రహస్యాలు ప్రపంచానికి వెల్లడించిన ఎడ్వర్డ్ స్నోడెన్‌కు రష్యా పౌరసత్వం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో స్నోడెన్‌కు రష్యాలో అన్ని హక్కులు ఉంటాయి.
ప్రేమలో విఫలమైన, బాయ్ ఫ్రెండ్ చేతిలో మోసపోయిన అమ్మాయిల కోసం ఒక కొత్త సర్వీసు అందుబాటులోకి వచ్చింది. బాయ్ ఫ్రెండ్‌ను అద్దెకు ఇచ్చేందుకు ఒక వెబ్ సైట్ రూపొందించారు బెంగళూరు యూత్.
ఆన్లైన్ షాపింగ్ సైట్లు అందిస్తున్న డిస్కౌంట్ల ద్వారా సెల్ఫోన్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. ఆదివారం ఒక్కరోజే దాదాపు 12 లక్షల శాంసంగ్ గెలాక్సీ మోడల్ ఫోన్లు అమ్ముడయ్యాయి. సెల్ఫోన్ల విక్రయాల్లో ఇదో రికార్డు.
దేశంలోనే తొలిసారిగా విద్యుత్ పంపిణీ వ్యవస్థలో డ్రోన్లను వినియోగించబోతున్నారు. హై వోల్టేజ్ టవర్ల పర్యవేక్షణ కోసం డ్రోన్లను వినియోగించేందుకు సిద్ధమైంది మధ్యప్రదేశ్ విద్యుత్ శాఖ. ఈ డ్రోన్లతో టవర్లు, కేబుళ్లను నిరంతరం పరిశీలిస్తారు.
రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో తాజాగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎవరిని సీఎంగా నియమించినా మద్దతు ఇవ్వాలని అశోక్ గెహ్లాట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం సరికాదని విమర్శించారు తెలంగాణ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి. దీనివల్ల వైఎస్సార్‌కు చెడ్డపేరు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే ఏపీ రాజధానిగా అమరావతే ఉండాలని సూచించారు.
జూపిటర్ గ్రహం నేడు భూమికి అతి దగ్గరగా రానుంది. అర్ధరాత్రి 01.30 గంటలకు జూపిటర్ భూమి సమీపంలోకి వస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రోజు తర్వాత తిరిగి భూమి సమీపంలోకి రావడానికి మళ్లీ 107 సంవత్సరాలు పడుతుంది.
యంగ్, మిడిల్ ఏజ్‌లోనే మరణించిన కొందరు ప్రముఖ సెలబ్రిటీలు ఇప్పుడు బతికుంటే ఎలా ఉండేవారో అన్న ఆలోచన వచ్చింది ఒక ఆర్టిస్ట్‌కు. అంతే.. అతడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి, సెలబ్రిటీలు ఎలా ఉండేవాళ్లో చూపించే కొన్ని చిత్రాల్ని క్రియేట్ చేశ�
డాలరుతో పోలిస్తే రూపాయి విలువ భారీగా పతనమైంది. అత్యంత కనిష్టానికి చేరుకుంది. ప్రస్తుతం రూపాయి విలువ 43 పైసలు తగ్గి, 81.52 వద్ద కొనసాగుతోంది. మరోవైపు భారత మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఐఫోన్ కొత్త మోడల్.. ఐఫోన్ 14 తయారీని ఇండియాలోనే ప్రారంభించింది యాపిల్. చెన్నై సమీపంలో ఉన్న శ్రీపెరుంబుదూర్‌లోని ఫాక్స్‌కాన్ ఫెసిలిటీ సెంటర్లో ఈ ఫోన్లు తయారు చేస్తోంది. మరి మన దేశంలోనే తయారవుతున్నాయి కాబట్టి, ఐఫోన్ 14 ధరలు తగ్గుతాయనుకుంటున్న�
కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్ష ఎన్నిక ఆ పార్టీలో చిచ్చు పెడుతోంది. రాజస్థాన్ కాంగ్రెస్‌లో కలవరం సృష్టిస్తోంది. సీఎం అశోక్ గెహ్లాట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. సచిన్ పైలట్‌ను సీఎం కాకుండా అడ్డుకుంటున్నారు.
హిమాచల్ ప్రదేశ్‌లో టూరిస్టులతో వెళ్తున్న టెంపో ట్రావెలర్ లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. మరో 10 మంది గాయపడ్డారు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది.
బంగ్లాదేశ్‌లో ఆదివారం జరిగిన పడవ ప్రమాదంలో 24 మంది మరణించారు. మరో 30 మందికిపైగా గల్లంతయ్యారు. మహాలయ అమావాస్య సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసేందుకు వీళ్లంతా పడవలో బయల్దేరగా, ఈ ఘటన జరిగింది.
ప్రతి ఏటా దసరా సందర్భంగా విజయవాడ, ఇంద్రకీలాద్రిపై ప్రతిష్టాత్మకంగా జరిగే శరన్నవరాత్రులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. పది రోజుల్లో అమ్మవారు పది రూపాల్లో దర్శనమివ్వనున్నారు.
మన దేశంలోకి చీతాల్ని తీసుకొచ్చి వారం రోజులు పూర్తయ్యాయి. అయితే, ఇప్పుడు చీతాలు ఎలా ఉన్నాయి? ఏం తింటున్నాయి? వాటిని ఎవరు పర్యవేక్షిస్తున్నారు? ఇంతకీ వాటిని అడవిలోకి వదిలిపెడతారా?
కేరళలో ఇటీవల అనూప్ అనే ఆటోడ్రైవర్ రూ.25 కోట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. గెలిచిన తర్వాత ఆనందం వ్యక్తం చేసిన అనూప్.. ఇప్పుడు తనకు మానసిక ప్రశాంతత కరువైందంటున్నాడు. నిద్ర కూడా పట్టడం లేదని వాపోతున్నాడు.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 27, మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వీటికి సోమవారం సాయంత్రం అంకురార్పణ జరుగుతుంది. అక్టోబర్ 5న బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. 5 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేస్తున్నారు.