Drones In Power Transmission: విద్యుత్ టవర్ల పర్యవేక్షణ కోసం డ్రోన్లు.. తొలిసారిగా వినియోగిస్తున్న మధ్యప్రదేశ్

దేశంలోనే తొలిసారిగా విద్యుత్ పంపిణీ వ్యవస్థలో డ్రోన్లను వినియోగించబోతున్నారు. హై వోల్టేజ్ టవర్ల పర్యవేక్షణ కోసం డ్రోన్లను వినియోగించేందుకు సిద్ధమైంది మధ్యప్రదేశ్ విద్యుత్ శాఖ. ఈ డ్రోన్లతో టవర్లు, కేబుళ్లను నిరంతరం పరిశీలిస్తారు.

Drones In Power Transmission: విద్యుత్ టవర్ల పర్యవేక్షణ కోసం డ్రోన్లు.. తొలిసారిగా వినియోగిస్తున్న మధ్యప్రదేశ్

Drones In Power Transmission: డ్రోన్లతో బోలెడన్ని ఉపయోగాలున్నాయి. నిఘా, భద్రత, మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్, రక్షణ, రవాణా, వ్యవసాయరంగంతోపాటు అనేక రంగాల్లో డ్రోన్లు ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు వీటిని తొలిసారిగా విద్యుత్ రంగంలో కూడా వాడబోతున్నారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థ పర్యవేక్షణలో డ్రోన్లను వాడాలని మధ్యప్రదేశ్ విద్యుత్ సంస్థ నిర్ణయించింది.

BiggBoss 6 Day 22 : ఈ వారం నామినేషన్స్ లో ఉంది వీళ్ళే..

10,000 హై వోల్టేజ్ టవర్స్ పర్యవేక్షణకు డ్రోన్లు వినియోగించాలని ‘మధ్యప్రదేశ్ పవర్ ట్రాన్స్‌మిషన్ కంపెనీ లిమిటెడ్ (ఎమ్‌పీపీటీసీఎల్)’ నిర్ణయించింది. దేశంలోనే తొలిసారిగా విద్యుత్ టవర్లు, కేబుళ్లను తనిఖీ చేసేందుకు అక్టోబర్ 1 నుంచి డ్రోన్లను వినియోగించబోతున్నట్లు అధికారులు తెలిపారు. విద్యుత్ టవర్లకు సంబంధించి అనేక సమస్యలు వస్తుంటాయనే సంగతి తెలిసిందే. ఎక్కడైనా కేబుళ్లు తెగిపోవడం వంటివి జరిగినప్పుడు వాటిని సిబ్బంది తనిఖీ చేస్తారు. దీనికి చాలా టైమ్ పడుతుంది. అప్పటివరకు విద్యుత్ పంపిణీ నిలిచిపోతుంది. అదే డ్రోన్లతో వేగంగా టవర్లు, కేబుళ్లను తనిఖీ చేయొచ్చు. డ్రోన్లకు అమర్చిన ప్రత్యేక కెమెరాల ద్వారా ఇవి టవర్లు, కేబుళ్లను అతి దగ్గరి నుంచి వీడియో, ఫొటోలు తీస్తాయి.

Mega154: “మెగా154″ను భారీ ధరకు కొనుగోలు చేసిన నెట్‭ఫ్లిక్స్‭!

దీని ద్వారా సమస్య ఎక్కడ ఉందో సులభంగా, తొందరగా గుర్తించవచ్చు. దీంతో సమస్య త్వరగా పరిష్కారం అవుతుంది. విద్యుత్ సరఫరా త్వరగా మెరుగవుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కొన్ని నెలలుగా డ్రోన్లు పరీక్షించి చూశారు. వీటివల్ల మంచి ఫలితాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అందుకే వీటిని పూర్తిస్థాయిలో వినియోగించనున్నారు. మధ్యప్రదేశ్‌లో మొత్తం 80,000 వరకు హై వోల్టేజ్ టవర్స్ ఉండగా, వాటిలో 10,000 టవర్స్‌ను ప్రస్తుతం డ్రోన్ల పరిధిలోకి తీసుకొస్తారు. మిగతా 70,000 టవర్ల కోసం కూడా డ్రోన్లను త్వరలోనే ఏర్పాటు చేస్తారు. ఒక ప్రైవేటు సంస్థతో కలిసి, విద్యుత్ అధికారులు ఈ పనిని పర్యవేక్షిస్తారు.