Edward Snowden: అమెరికాకు షాక్ ఇచ్చిన రష్యా.. స్నోడెన్‌కు పౌరసత్వం ఇచ్చిన పుతిన్

రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు షాక్ ఇచ్చాడు. అమెరికా రహస్యాలు ప్రపంచానికి వెల్లడించిన ఎడ్వర్డ్ స్నోడెన్‌కు రష్యా పౌరసత్వం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో స్నోడెన్‌కు రష్యాలో అన్ని హక్కులు ఉంటాయి.

Edward Snowden: అమెరికాకు షాక్ ఇచ్చిన రష్యా.. స్నోడెన్‌కు పౌరసత్వం ఇచ్చిన పుతిన్

Updated On : September 27, 2022 / 8:54 AM IST

Edward Snowden: అమెరికాకు రష్యా అధ్యక్షుడు పుతిన్ షాక్ ఇచ్చాడు. అమెరికా నిఘా రహస్యాలు వెల్లడించిన ఎడ్వర్డ్ స్నోడెన్‌కు రష్యా పౌరసత్వం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. అమెరికాకు చెందిన స్నోడెన్ అమెరికా నిఘా విభాగం ఎన్ఎస్ఏ (నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ)లో కాంట్రాక్టర్‌గా ఉండేవాడు.

Samsung Smartphones: డిస్కౌంట్లతో జోష్.. అమ్మకాల్లో శాంసంగ్ రికార్డు.. ఒక్కరోజే 12 లక్షల ఫోన్ల విక్రయం

ఆ సమయంలో అక్కడ సేకరించిన పలు రహస్యాల్ని స్నోడెన్ బయటపెట్టాడు. అమెరికా జాతీయంగా, అంతర్జాతీయంగా నిర్వహించిన పలు ఆపరేషన్స్ వివరాల్ని, నిఘా సమాచారాన్ని 2013లో స్నోడెన్ ప్రపంచానికి వెల్లడించాడు. ఈ అంశాలు అప్పట్లో వివాదాస్పదమయ్యాయి. స్నోడెన్ వెల్లడించిన అంశాలు అవాస్తవమని అమెరికా చెప్పింది. ఈ నేపథ్యంలో అమెరికా అతడిపై గూఢచర్యం కేసు మోపింది. కానీ, అప్పటికే అతడు అమెరికా విడిచి రష్యాకు పారిపోయాడు. అప్పట్నుంచి రష్యాలోనే ఆశ్రయం పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడు విచారణ ఎదుర్కొనేందుకు తిరిగి అమెరికా రావాలని ఆ దేశం కోరుతోంది. అయితే, స్నోడెన్ అమెరికా వెళ్లడానికి సిద్ధంగా లేడు. ఇంతకాలం రష్యాలో స్నోడెన్ శరణార్థిగానే ఉన్నాడు.

Boyfriend For Hire: అద్దెకు బాయ్ ఫ్రెండ్… వెబ్‌సైట్ ప్రారంభం.. కానీ ఓ కండిషన్!

అయితే, తాజాగా స్నోడెన్‌కు రష్యా పౌరసత్వం కల్పిస్తూ సోమవారం పుతిన్ నిర్ణయం తీసుకున్నాడు. దాదాపు 72 మంది విదేశీయులకు రష్యా పౌరసత్వం కల్పించగా, వారిలో స్నోడెన్ కూడా ఉన్నాడు. ఈ నిర్ణయంపై స్నోడెన్ ఇంతవరకు స్నోడెన్ స్పందించలేదు. స్నోడెన్‌కు 2020లోనే రష్యాలో అన్ని హక్కులు కల్పిస్తున్నట్లు పుతిన్ ప్రకటించాడు. తాజాగా అధికారికంగా రష్యా పౌరసత్వం కల్పించాడు. తాజా నిర్ణయంతో స్నోడెన్‌ను తన దేశం రప్పించుకోవాలి అనుకునే అమెరికా ప్రయత్నాలకు మరింత ఆటంకం కలుగుతుంది.