Samsung Smartphones: డిస్కౌంట్లతో జోష్.. అమ్మకాల్లో శాంసంగ్ రికార్డు.. ఒక్కరోజే 12 లక్షల ఫోన్ల విక్రయం

ఆన్‌లైన్ షాపింగ్ సైట్లు అందిస్తున్న డిస్కౌంట్ల ద్వారా సెల్‌ఫోన్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. ఆదివారం ఒక్కరోజే దాదాపు 12 లక్షల శాంసంగ్ గెలాక్సీ మోడల్ ఫోన్లు అమ్ముడయ్యాయి. సెల్‌ఫోన్ల విక్రయాల్లో ఇదో రికార్డు.

Samsung Smartphones: డిస్కౌంట్లతో జోష్.. అమ్మకాల్లో శాంసంగ్ రికార్డు.. ఒక్కరోజే 12 లక్షల ఫోన్ల విక్రయం

Samsung Smartphones: దేశంలో సెల్‌ఫోన్ల అమ్మకాల్లో దక్షిణ కొరియా సంస్థ శాంసంగ్ రికార్డ్ సృష్టించింది. ఒక్కరోజులోనే 12 లక్షల ఫోన్లు విక్రయించింది. ఆదివారం ఒక్కరోజే దాదాపు 12 లక్షల శాంసంగ్ గెలాక్సీ మోడల్ ఫోన్లు అమ్ముడైనట్లు ఆ సంస్థ ప్రకటించింది.

Drones In Power Transmission: విద్యుత్ టవర్ల పర్యవేక్షణ కోసం డ్రోన్లు.. తొలిసారిగా వినియోగిస్తున్న మధ్యప్రదేశ్

వీటి విలువ దాదాపు రూ.1,000 కోట్లకుపైగానే ఉంటుందని కంపెనీ తెలిపింది. రాబోయే దసరాను పురస్కరించుకుని దేశంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి పలు ఈ-కామర్స్ సైట్లు డిస్కౌంట్లతో వివిధ ఉత్పత్తుల్ని విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు కంపెనీలు తమ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు ప్రకటించాయి. శాంసంగ్ ఫోన్లపై కూడా 17-60 శాతం డిస్కౌంట్స్ అందిస్తున్నాయి. ప్రీమియం ఫోన్లపై కూడా 17-38 శాతం డిస్కౌంట్ ఇస్తున్నాయి. దీంతో కస్టమర్లు భారీగా కొనుగోళ్లకు పాల్పడుతున్నారు. ఎక్కువగా మొబైల్ ఫోన్లు కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శాంసంగ్ ఫోన్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి.

Mega154: “మెగా154″ను భారీ ధరకు కొనుగోలు చేసిన నెట్‭ఫ్లిక్స్‭!

వివిధ ఆఫర్ల కారణంగా ఆదివారం ఒక్కరోజే భారీ స్థాయిలో ఫోన్లు విక్రయమయ్యాయి. వీటిలో శాంసంగ్ గెలాక్సీ ఫోన్లు 12 లక్షల వరకు ఉన్నాయి. ఎక్కువగా అమ్ముడవుతున్న శాంసంగ్ గెలాక్సీ ఫోన్లలో శాంసంగ్ ఎమ్13 మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత శాంసంగ్ గెలాక్సీ ఎమ్32 ప్రైమ్, గెలాక్సీ ఎమ్33, గెలాక్సీ ఎస్22, గెలాక్సీ ఎస్20ఎఫ్ఈ ఫోన్లు ఉన్నాయి. ఆన్‌లైన్ షాపింగ్ సైట్లలో సేల్స్ ద్వారా శాంసంగ్ సంస్థ అమ్మకాలు దాదాపు రెట్టింపయ్యాయి.