Boyfriend For Hire: అద్దెకు బాయ్ ఫ్రెండ్… వెబ్‌సైట్ ప్రారంభం.. కానీ ఓ కండిషన్!

ప్రేమలో విఫలమైన, బాయ్ ఫ్రెండ్ చేతిలో మోసపోయిన అమ్మాయిల కోసం ఒక కొత్త సర్వీసు అందుబాటులోకి వచ్చింది. బాయ్ ఫ్రెండ్‌ను అద్దెకు ఇచ్చేందుకు ఒక వెబ్ సైట్ రూపొందించారు బెంగళూరు యూత్.

Boyfriend For Hire: అద్దెకు బాయ్ ఫ్రెండ్… వెబ్‌సైట్ ప్రారంభం.. కానీ ఓ కండిషన్!

Updated On : September 27, 2022 / 8:23 AM IST

Boyfriend For Hire: ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలకు బాయ్ ఫ్రెండ్‌ ఉండటం కామన్. కానీ, ఎంతగానో ఇష్టపడ్డ బాయ్ ఫ్రెండ్‌ ఏదో ఒక రోజు దూరం పెట్టొచ్చు. దీంతో అమ్మాయిుల్లో చాలా మంది తీవ్ర వేదనకు గురవుతుంటారు.

Samsung Smartphones: డిస్కౌంట్లతో జోష్.. అమ్మకాల్లో శాంసంగ్ రికార్డు.. ఒక్కరోజే 12 లక్షల ఫోన్ల విక్రయం

ఇష్టపడ్డ వ్యక్తి మోసం చేశాడని, కోరుకున్న ప్రేమ దక్కలేదని బాధపడుతుంటారు. అలాంటి వాళ్లకోసమే బెంగళూరుకు చెందిన కొందరు యూత్ కలిసి ఒక వెబ్‌సైట్ ప్రారంభించారు. ‘టాయ్ బాయ్’ పేరుతో రూపొందిన ఈ వెబ్‌సైట్ ద్వారా బాయ్ ఫ్రెండ్స్‌ను అద్దెకిస్తారు. అలాగని ఈ బాయ్ ఫ్రెండ్స్ అమ్మాయిలతోపాటు బయటికి రారు. బాయ్ ఫ్రెండ్‌ని సినిమాలు, షాపింగ్, రెస్టారెంట్లు వంటి వాటికి తీసుకెళ్దామంటే కుదరదు. ఎందుకంటే ఈ అద్దె బాయ్ ఫ్రెండ్ కేవలం ఫోన్ లేదా ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాడు. వ్యక్తిగతంగా ఎవరినీ కలవడు. ఎవరైనా అమ్మాయిలు మానసిక వేదన, ఒత్తిడిలో ఉంటే.. వారితో ఫోన్ ద్వారా మాట్లాడుతాడు. అమ్మాయిల సమస్యను విని, వాళ్ల ఆందోళనను, వేదనను తొలగించేందుకు ప్రయత్నిస్తాడు.

Drones In Power Transmission: విద్యుత్ టవర్ల పర్యవేక్షణ కోసం డ్రోన్లు.. తొలిసారిగా వినియోగిస్తున్న మధ్యప్రదేశ్

ప్రేమలో విఫలమైన, బాయ్ ఫ్రెండ్ చేతిలో మోసపోయిన వారికి మానసిక వేదన తొలగించి, ప్రశాంతత అందివ్వడమే ఈ వెబ్ సైట్ సర్వీస్ ఉద్దేశం. యూజర్లు తమ పోర్టల్ లేదా యాప్ ద్వారా ఈ సేవలు పొందొచ్చు. దీనికి కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. గంటల లెక్కన ఛార్జ్ చేస్తారు. ప్రస్తుతం ఇదొక స్టార్టప్ మాత్రమే. బెంగళూరుకు చెందిన కొందరు యూత్ దీన్ని డెవలప్ చేశారు. జపాన్ వంటి పలు దేశాల్లో ఈ తరహా సేవలు అందుతున్నాయి. అయితే, ఇలాంటి సైట్లు, సేవల విషయంలో ప్రభుత్వం, ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి.