Home » Author »Narender Thiru
మన దేశంలోని అరుదైన పూలల్లో ఒకటైన ‘నీలకురింజి’ పూలు తాజాగా విరబూశాయి. ఈ పూలు 12 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే పూస్తాయి. తాజాగా కర్ణాటకలోని నీలగిరి పర్వతాల్లో ఇవి విరబూశాయి. సందర్శకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.
పంజాబ్‌లోని ఛండీఘడ్ ఎయిర్పోర్ట్ పేరుకు భగత్ సింగ్ పేరు పెట్టబోతున్నట్లు ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రజలంతా ప్లాస్టిక్ బ్యాగుల బదులు జూట్, కాటన్, అరటి పీచు వంటి సహజ ఉత్పత్తులతో తయారైన బ్యాగులనే వాడాలని చెప్పారు.
‘మేకిన్ ఇండియా’ నినాదంతో మన దేశంలో బొమ్మల తయారీ రంగం ఊపందుకుంది. ఒకప్పుడు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఇప్పుడు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఈ రంగం అభివృద్ధి చెందింది. ఇటీవలి కాలంలో 636 శాతం ఎగుమతులు పెరిగాయని కేంద్రం తెలిపిం�
భార్య ఉద్యోగం చేయడం ఇష్టం లేని భర్త దారుణానికి తెగించాడు. ఆమెపై కత్తితో దాడి చేశాడు. కడుపులో విచక్షణారహితంగా పొడవడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
ఇటీవల హత్యకు గురైన అంకితా భండారి హత్య కేసులో నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, తాను పేదదాన్నే అయినప్పటికీ, డబ్బు కోసం తనను తాను అమ్ముకోలేనని స్నేహితురాలికి మెసేజ్ చేసింది అంకిత.
మహిళలు, యూజర్ల సేఫ్టీ కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్ రూపొందిస్తోంది. ‘న్యూడిటీ ప్రొటెక్షన్’ పేరుతో రానున్న ఈ ఫీచర్ ద్వారా యూజర్లు అసభ్యకరమైన, న్యూడ్ ఫొటోలు తమ చాట్‌లో కనిపించకుండా చేయవచ్చు.
కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం త్వరలో రైతులకు అనుకూలంగా కొత్త చట్టం రూపొందించబోతుంది. బ్యాంకు రుణాలు చెల్లించకుంటే రైతుల ఆస్తులు జప్తు చేయకుండా ఉండేలా కొత్త చట్టాన్ని రూపొందిస్తున్నట్లు సీఎం బొమ్మై ప్రకటించారు.
తిరుపతి జిల్లా రేణిగుంటలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. క్లినిక్‌లో అగ్నిప్రమాదం జరగడంతో ఆస్పత్రిలో ఉన్న డాక్టర్‌తోపాటు ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు మహిళల్ని రెస్క్యూ టీమ్ రక్షించింది.
కుక్కల మీద ప్రేమతో ఒక యువకుడు సాహసం చేశాడు. వాటి సంక్షేమం కోసం నిధులు సేకరించేందుకు అరుదైన పని చేశాడు. 24 గంటల్లో, 75 పబ్బుల్లో డ్రింక్ తాగి రికార్డు సృష్టించాడు.
ఇది కచ్చితంగా వింతే! కాకపోతే.. తన డెత్ సర్టిఫికెట్ పోయిందని తనే పత్రికా ప్రకటన ఇవ్వడం ఏంటి? దీన్ని ఆ పేపర్ వాళ్లు అలాగే ప్రచురించడం ఏంటి! దీనిపై నెటిజన్లు సరదగా స్పందిస్తున్నారు.
పాస్‌పోర్ట్ ఫొటో కోసం స్టూడియోకు వెళ్లిన అమ్మాయిపై ఫొటోగ్రాఫర్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఒంటరిగా ఉండటం చూసి లైంగిక దాడికి యత్నించాడు. దీన్ని ఆ యువతి ప్రతిఘటించింది. అయితే, ఈ విషయం బయట చెబితే చంపేస్తానని ఆమెను బెదిరించాడు.
ఆఫ్‌లైన్ టిక్కెట్ల కోసం అభిమానులు జింఖానా గ్రౌండ్‌కు రావొద్దని సూచించింది హెచ్‌సీఏ. గ్రౌండ్ వద్ద ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి మాత్రమే టిక్కెట్లు అందజేస్తామని ప్రకటించింది. అయినప్పటికీ గ్రౌండ్ వద్ద అభిమానులు ఇంకా పడిగాపులు పడుతున్�
విమానం గాల్లోకి ఎగరగానే దాన్నుంచి మంటలు ఎగసిపడ్డాయి. నిప్పు రవ్వలు నేల మీద పడ్డాయి. ఈ ఘటనలో విమానం ఎలాంటి ప్రమాదానికి గురి కాలేదు. సేఫ్‌గానే ల్యాండ్ అయ్యింది.
ఇండియా-ఆస్ట్రేలియా మూడో టీ20 శుక్రవారం సాయంత్రం జరగనుంది. నాగ్‌పూర్ వేదికంగా సాయంత్రం ఏడు గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. భారత్ సిరీస్ నెగ్గాలంటే ఈ మ్యాచ్ గెలవాల్సిందే. మరోవైపు ఇండియాను బౌలింగ్ సమస్య వేధిస్తోంది.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో బిహార్ సీఎం నితీష్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భేటీ కానున్నారు. ఈ నెల 25న వారు సోనియాను కలిసి పలు రాజకీయ అంశాలపై చర్చిస్తారు.
ఉత్తర ప్రదేశ్‌లో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత బుధవారం ఒక్క రోజే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాల కారణంగా ఇండ్లు, గోడలు కూలిపోవడంతో వీరంతా మరణించారు. వీరిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు.
తెలంగాణకే ప్రత్యేకం ‘బతుకమ్మ’ వేడుకలు. దశాబ్దాల నుంచి తెలంగాణ సంస్కృతిలో భాగంగా ఈ వేడుకలు కొనసాగుతున్నాయి. ఈ నెల 25 నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలు రోజూ ఒకేలా ఉండవు. తొమ్మిది రోజులు.. తొమ్మిది తీర్లుగా ఈ వేడుకలు సాగుతాయి.
మద్యానికి బానిసైన కొడుకు దారుణానికి ఒడిగట్టాడు. తాగడానికి తల్లి డబ్బులు ఇవ్వలేదని ఆమెపైనే కిరోసిన్ పోసి తగలబెట్టాడు. ఈ ఘటనలో ఆమె తీవ్ర గాయాలపాలై, ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి డాక్టర్లు ఎందరి ప్రాణాల్నో నిలబెడుతుంటారు. తాజాగా ఒక డాక్టర్ చిన్నారికి ఊపిరిలూది ప్రాణం పోసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
గుజరాత్, వడోదరలోని సెంట్రల్ జైలులో అండర్ ట్రయల్ ఖైదీలు ఆత్మహత్యాయత్నం చేశారు. జైలు అధికారులు తమకు సరిగ్గా భోజనం పెట్టకపోవడంతోపాటు, లంచం డిమాండ్ చేయడం వల్లే ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది.