Home » Author »Narender Thiru
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కేసు విషయంలో ఎలాంటి పురోగతి లేదని, కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ వివేకా కుమార్తె దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఏపీ ప్రభుత్వానికి సుప్ర�
పోలవరంపై అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన ప్రజెంటేషన్‌పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా జగన్ అబద్ధాలు చెప్పారని, దమ్ముంటే వైసీపీ నేతలు తమతో చర్చకు రావాలని సవాల్ విసిరారు.
రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతుల్ని పెంచుకోవడం వల్ల మన దేశానికి దాదాపు రూ.35,000 కోట్లు లాభపడింది. రష్యా నుంచి ఇండియా తక్కువ ధరకే చమురు కొనుగోలు చేస్తోంది. పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడం, భారత్‌కు కలిసొచ్చింది.
దళిత బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై డీజిల్ పోసి దహనం చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.
ఎలన్ మస్క్ సంస్థ ‘స్పేస్ ఎక్స్’ మరో ఘనత సాధించింది. తాజాగా ఏడు ఖండాల్లో ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తెచ్చింది. కేబుళ్లు, మొబైల్ టవర్లతో పని లేకుండానే యూజర్లు ఈ టెక్నాలజీతో ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చు.
ఇటీవల నమీబియా నుంచి ప్రత్యేక కార్గో విమానంలో చీతాల్ని ఇండియా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ విమానం ఇండియాకు చెందిన బోయింగ్ విమానమే అని జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని తేలింది. ఇది భారత్‌కు చెందిన విమానం కాదు.
పిట్‌బుల్, జర్మన్ షెఫర్డ్తోపాటు పలు జాతులకు చెందిన కుక్కలు వీధుల్లో దర్శనమిస్తున్నాయి. వాటిని యజమానులే రోడ్లపై వదిలేసి వెళ్తున్నారు. రాత్రిపూట, ఎవరూ లేని సమయంలో వాటిని వదిలించుకుంటున్నారు. దీనికి కారణం ఉంది.
వీధి కుక్క తన ఇంటి దగ్గర ఉండటం ఇష్టం లేని ఒక డాక్టర్ అమానుషంగా ప్రవర్తించాడు. ఆ కుక్కను తన కారుకు కట్టేసి, కారు నడుపుకొంటూ వెళ్లిపోయాడు. దీన్ని రోడ్డుపై వెళ్తున్న ఒక వ్యక్తి అడ్డుకున్నాడు. ఈ ఘటనలో కుక్క గాయాలపాలైంది.
చండీఘడ్ యూనవర్సిటీ వివాదం కొనసాగుతోంది. క్యాంపస్‌లో అమ్మాయిలు ఇంకా నిరసన కొనసాగిస్తున్నారు. కాగా, ఒక్క వీడియోనే లీక్ అయిందని యూనివర్సిటీ అధికారులు చెబుతుండటాన్ని విద్యార్థినులు తప్పుబడుతున్నారు. కేసును తొక్కిపెట్టేందుకు యూనివర్సిటీ అధ
పదో తరగతి విద్యార్థిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడో ఎనిమిదో తరగతి విద్యార్థి. ఈ ఘటన తెలంగాణలోని, మహబూబాబాద్ జిల్లా, నెల్లికుదురులో జరిగింది. పోలీసులు విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
మహిళా న్యాయవాదిపై ఒక దుండగుడు కొడవలితో దాడికి పాల్పడ్డాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆమె కూతురుపైనా దాడి చేశాడు. అడ్వకేట్స్ ఆఫీసులోనే, గుర్తు తెలియని వ్యక్తి ఈ దాడి చేశాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో జరిగింది.
పంజాబ్ యూనివర్సిటీ విద్యార్థినిల వీడియో లీక్ అంశానికి సంబంధించి పోలీసులు మరో నిందితుడిని అరెస్టు చేశారు. వీడియో పంపించిన యువతి స్నేహితుడిని సిమ్లాలోని, రోహ్రు ప్రాంతంలో అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇది రెండో అరెస్టు.
భారత వైమానిక దళం సత్తాని ప్రపంచానికి చాటి చెప్పేలా విన్యాసాలు నిర్వహిస్తుంది ఎయిర్ ఫోర్స్. తాజాగా ఒడిశాలోని పూరి పట్టణంలో, ‘సూర్య కిరణ్’ బృంద ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శన వీక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది.
మధ్యప్రదేశ్‌లో ఎక్సైజ్ అధికారులు అక్రమ మద్యంపై కొరడా ఝుళిపించారు. లక్షకుపైగా బీర్ బాటిళ్లు, ఇతర మద్యం సీసాలను బుల్డోజర్తో ధ్వంసం చేశారు. ఈ మద్యం విలువ రూ.1.5 కోట్లు ఉంటుందని అంచనా.
ఇటీవల మరణించిన బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలు సోమవారం జరగబోతున్నాయి. దీనికోసం బ్రిటన్ భారీగా ఖర్చు చేస్తోంది. ప్రపంచ దేశాధినేతలు హాజరవుతున్నందున వారి భద్రత, ఇతర అవసరాల కోసం దాదాపు 9 మిలియన్ డాలర్లు ఖర్చు చేయబోతున్నారని సమాచారం.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణ నౌకల్లో ఒకటిగా నిర్మాణమవుతున్న ‘గ్లోబల్ డ్రీమ్’ త్వరలో ముక్కలవుతుందా? ప్రయాణం మొదలుపెట్టకుండానే ఈ నౌక తుక్కు రూపంలోకి మారిపోతుందా? ప్రస్తుత పరిస్థితుల్ని చూస్తే నిజమేననిపిస్తోంది. ఈ నౌక నిర్మాణానికి ఇంకా చాల�
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించారు ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని. పవన్ వారాంతపు నాయకుడని పేర్ని నాని విమర్శించారు. పవన్ చిరంజీవి దయతోనే ఎదిగారని, ఇప్పుడు ఆయననే తప్పుబడుతున్నారని నాని అన్నారు.
దేశంలోని బ్యాంకుల్లో, బ్రాంచ్ లెవెల్లో అధికారులు కస్టమర్లతో స్థానిక భాషల్లోనే మాట్లాడాలని బ్యాంకర్లకు సూచించారు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్. శనివారం బ్యాంకర్లతో నిర్వహించిన ఒక సమావేశంలో ఆమె మాట్లాడారు.
ఏపీలోని నెల్లూరు జిల్లాలో రైలు ప్రమాదం తప్పింది. వేదాయపాలెం వద్ద భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఆదివారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ కలగలేదు.
దేశంలోకి చీతాల రాకతో దేశ ప్రజలు సంతోషిస్తుంటే, కునో పార్కు సమీపంలోని ప్రజలు మాత్రం ఆందోళనకు గురవుతున్నారు. పార్కు కోసం తమ ఊళ్లను ఎక్కడ లాక్కుంటారో అని, దీనివల్ల తమ జీవనోపాధి దెబ్బతింటుందని ప్రజలు భయపడుతున్నారు.