Student Filed A Complaint: పోలీసుల్ని ఆశ్రయించిన ఎనిమిదో తరగతి విద్యార్థి.. ఇంతకీ బాలుడి సమస్యేంటో తెలుసా!

పదో తరగతి విద్యార్థిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడో ఎనిమిదో తరగతి విద్యార్థి. ఈ ఘటన తెలంగాణలోని, మహబూబాబాద్ జిల్లా, నెల్లికుదురులో జరిగింది. పోలీసులు విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.

Student Filed A Complaint: పోలీసుల్ని ఆశ్రయించిన ఎనిమిదో తరగతి విద్యార్థి.. ఇంతకీ బాలుడి సమస్యేంటో తెలుసా!

Updated On : September 18, 2022 / 8:47 PM IST

Student Filed A Complaint: స్కూల్లో విద్యార్థుల మధ్య గొడవలైనా, సీనియర్లు కొట్టినా పిల్లలు సాధారణంగా టీచర్లకు ఫిర్యాదు చేస్తుంటారు. కానీ, ఒక స్కూల్ స్టూడెంట్ మాత్రం తన సీనియ‌ర్‌పై ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Beer Bottles Video: బుల్డోజర్‌తో లక్ష బీర్ బాటిళ్లు ధ్వంసం చేసిన ఎక్సైజ్ శాఖ.. ఎందుకో తెలుసా!

ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా, నెల్లికుదురులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ఎస్సీ బాలుర వసతి గృహంలో చదువుతున్న పదో తరగతికి చెందిన నవీన్ ఒక విద్యార్థి తరచూ ఎనిమిదో తరగతి చదువుతున్న ఉపేందర్ అనే విద్యార్థిని కొడుతున్నాడు. దీనిపై ఉపేందర్ హాస్టల్ వార్డెన్‌కు ఫిర్యాదు చేశాడు. అయినా వార్డెన్ పట్టించుకోలేదు. దీంతో విసుగు చెందిన ఉపేందర్ ఏకంగా స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు.

Indian Air Force: యుద్ధ విమానాలతో ఒళ్లు జలధరించేలా భారత వాయుసేన విన్యాసాలు.. ఆకట్టుకుంటున్న వీడియో

నెల్లికుదురు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, నవీన్‌పై ఫిర్యాదు చేశాడు. తనను అతడు రోజూ కొడుతున్నాడని, అతడిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. దీంతో స్పందించిన పోలీసులు ఇద్దరు విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.