Beer Bottles Video: బుల్డోజర్‌తో లక్ష బీర్ బాటిళ్లు ధ్వంసం చేసిన ఎక్సైజ్ శాఖ.. ఎందుకో తెలుసా!

మధ్యప్రదేశ్‌లో ఎక్సైజ్ అధికారులు అక్రమ మద్యంపై కొరడా ఝుళిపించారు. లక్షకుపైగా బీర్ బాటిళ్లు, ఇతర మద్యం సీసాలను బుల్డోజర్‌తో ధ్వంసం చేశారు. ఈ మద్యం విలువ రూ.1.5 కోట్లు ఉంటుందని అంచనా.

Beer Bottles Video: బుల్డోజర్‌తో లక్ష బీర్ బాటిళ్లు ధ్వంసం చేసిన ఎక్సైజ్ శాఖ.. ఎందుకో తెలుసా!

Beer Bottles Video: లక్షకుపైగా బీర్ బాటిళ్లను ధ్వంసం చేసింది మధ్యప్రదేశ్ ఎక్సైజ్ శాఖ. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఎక్సైజ్ శాఖ ఈ పని చేసింది. రాష్ట్రంలో కొంతకాలంగా కాలం చెల్లిన (ఎక్స్‌పైర్) అయిన మద్యాన్ని కూడా అక్రమంగా అమ్ముతున్నారు.

Biggest Cruise Ship: ప్రయాణానికి ముందే ముక్కలుముక్కలు కానున్న రూ.8 వేల కోట్ల నౌక.. ఎందుకో తెలుసా!

దీనిపై అనేక ఫిర్యాదులు రావడంతో ఎక్సైజ్ శాఖ స్పందించింది. అనేక చోట్ల దాడులు నిర్వహించి, కాలం చెల్లిన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుంది. వీటిలో బీర్ బాటిళ్లతోపాటు, ఇతర మద్యం సీసాలు కూడా ఉన్నాయి. ఇవి దాదాపు ఆరు నెలల క్రితమే ఎక్స్‌పైర్ అయ్యాయి. అయినప్పటికీ వీటిని విక్రయించేందుకు వ్యాపారులు ప్రయత్నించారు. దీంతో ఈ బాటిళ్లను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు వీటిని ధ్వంసం చేయాలని నిర్ణయించుకున్నారు. తాజాగా అలాంటి కాలం చెల్లిన లక్షకు పైగా బీర్, ఇతర మద్యం బాటిళ్లను రోడ్డుపై వేసి, బుల్డోజర్లతో ధ్వంసం చేశారు.

Nirmala Sitharaman: స్థానిక భాషలకు ప్రాధాన్యమివ్వండి.. బ్యాంకర్లకు నిర్మలా సీతారామన్ సూచన

ఈ మద్యం విలువ కోటిన్నర రూపాయలకు పైగానే ఉంటుందని అంచనా. మధ్యప్రదేశ్‌లో ఇలా మద్యం ధ్వంసం చేయడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి. కాగా, దీనికి సంబంధించిన వీడియోలు అక్కడి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.