Nirmala Sitharaman: స్థానిక భాషలకు ప్రాధాన్యమివ్వండి.. బ్యాంకర్లకు నిర్మలా సీతారామన్ సూచన

దేశంలోని బ్యాంకుల్లో, బ్రాంచ్ లెవెల్లో అధికారులు కస్టమర్లతో స్థానిక భాషల్లోనే మాట్లాడాలని బ్యాంకర్లకు సూచించారు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్. శనివారం బ్యాంకర్లతో నిర్వహించిన ఒక సమావేశంలో ఆమె మాట్లాడారు.

Nirmala Sitharaman: స్థానిక భాషలకు ప్రాధాన్యమివ్వండి.. బ్యాంకర్లకు నిర్మలా సీతారామన్ సూచన

Nirmala Sitharaman: దేశంలోని అన్ని బ్యాంకులకు చెందిన అధికారులు కస్టమర్లతో స్థానిక భాషల్లోనే మాట్లాడాలని సూచించారు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్. అప్పుడే వినియోగదారుల వ్యాపార అవసరాలు తీరుతాయని నిర్మల అన్నారు.

Kuno National Park: చీతాల రాకపై స్థానికుల్లో ఆందోళన.. తమ ఊళ్లు ఏమవుతాయోనని భయపడుతున్న ప్రజలు

ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ వార్షిక సర్వసభ్య సమావేశంలో బ్యాంకర్లతో నిర్మలా సీతారామన్ శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బ్రాంచి స్థాయి అధికారులు స్థానిక భాషల్లోనే మాట్లాడాలని కోరారు. అధికారులు కొత్త భాషల్ని ఎందుకు నేర్చుకోలేకపోతున్నారని ఆమె ప్రశ్నించారు. స్థానిక భాషలు మాట్లాడగలిగేలా బ్యాంకులు సిబ్బందిని సమీక్షించుకోవాలని సూచించారు. ‘‘స్థానిక భాషలు మాట్లాడే వారినే కస్టమర్ ఫేసింగ్ బ్రాంచ్ ఆఫీసుల్లో ఉండేలా చూసుకోవాలి. కస్టమర్లతో మాట్లాడగలిగే విభాగాల్లో స్థానిక భాషలు తెలిసిన వారిని మాత్రమే నియమించుకుని, మిగిలిన సిబ్బందిని ఇతర సేవలకు వాడుకోవాలి. దేశంలో వివిధ భాషలు మాట్లాడగలిగే వ్యక్తులు ఉన్నారు. కాబట్టి, బ్యాంకులు తమ సిబ్బందిని నియమించుకునేటప్పుడు స్థానిక భాషలు తెలిసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలి.

Bhubaneswar Express: ఏపీలో భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు.. తప్పిన ప్రమాదం

కస్టమర్లతో మాట్లాడే విధానాన్ని కూడా వారికి నేర్పించాలి. ఫలానా భాషే మాట్లాడాలని కస్టమర్లపై ఒత్తిడి తేవడం సరికాదు. హిందీ మాట్లాడకపోతే వాళ్లు భారతీయులే కాదన్న విధంగా కొందరు వ్యవహరిస్తున్నారు. వాస్తవంగా జరిగినదాన్నే ఇక్కడ ప్రస్తావిస్తున్నా. ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదు. బ్యాంకింగ్ కరస్పాండెంట్లుగా మహిళా ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారు. తమ పురుష సహోద్యోగుల కంటే బాగా పనిచేస్తున్నారు. మరింతమంది మహిళల్ని ఈ విభాగంలో నియమించుకునేలా బ్యాంకర్లు సహకరించాలి’’ అని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.