Biggest Cruise Ship: ప్రయాణానికి ముందే ముక్కలుముక్కలు కానున్న రూ.8 వేల కోట్ల నౌక.. ఎందుకో తెలుసా!

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణ నౌకల్లో ఒకటిగా నిర్మాణమవుతున్న ‘గ్లోబల్ డ్రీమ్’ త్వరలో ముక్కలవుతుందా? ప్రయాణం మొదలుపెట్టకుండానే ఈ నౌక తుక్కు రూపంలోకి మారిపోతుందా? ప్రస్తుత పరిస్థితుల్ని చూస్తే నిజమేననిపిస్తోంది. ఈ నౌక నిర్మాణానికి ఇంకా చాలా నిధులు కావాలి. నిధులు సమకూరకపోవడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.

Biggest Cruise Ship: ప్రయాణానికి ముందే ముక్కలుముక్కలు కానున్న రూ.8 వేల కోట్ల నౌక.. ఎందుకో తెలుసా!

Biggest Cruise Ship: ‘గ్లోబల్ డ్రీమ్’.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణ నౌకల్లో ఒకటి. ఒకేసారి 9,000 మంది ఈ నౌకలో ప్రయాణించవచ్చు. అత్యాధునిక సౌకర్యాలతో, అందంగా నిర్మిస్తున్నారు. కానీ, ఈ పడవ త్వరలో ముక్కలుముక్కలు కానుంది. ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాకుండానే, ‘గ్లోబల్ డ్రీమ్’ తుప్పుగా మారబోతుంది.

Bhubaneswar Express: ఏపీలో భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు.. తప్పిన ప్రమాదం

ఈ పడవను తయారు చేస్తున్న జర్మనీకి చెందిన ‘ఎంవీ వెర్ఫ్‌టెన్’ అనే సంస్థ ఈ నౌకను కూల్చివేయాలనుకుంటోంది. దీనికి కారణం తయారీ సంస్థ ఆర్థిక నష్టాల్లో కూరుకుపోవడమే. తమ సంస్థ దివాళా తీసిందని ‘ఎంవీ వెర్ఫ్‌టెన్’ గత జనవరిలోనే ప్రకటించింది. నిజానికి ఈ నౌక నిర్మాణమే ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే అత్యంత పెద్ద నౌకల్లో ఒకటిగా ఇది నిలవబోతుందని అందరూ దీనిపై దృష్టి సారించారు. ఎక్కువ మంది ప్రయాణించేలా రూపొందిస్తున్న ఈ నౌకలో ఆధునిక వసతులున్నాయి. ఓపెన్ ఏరియా స్విమ్మింగ్ పూల్, సినిమా థియేటర్, ఇతర లగ్జరీ సౌకర్యాలు ఉన్నాయి. దీని బరువు 2,08,000 టన్నులు. దీని నిర్మాణానికి సంస్థ రూ.11,090 కోట్లుగా అంచనా వేసింది.

Kuno National Park: చీతాల రాకపై స్థానికుల్లో ఆందోళన.. తమ ఊళ్లు ఏమవుతాయోనని భయపడుతున్న ప్రజలు

ఇప్పటికే ఎనభై శాతం పైగా నిర్మాణం పూర్తవగా దీని కోసం రూ.8,313 కోట్లు ఖర్చైంది. నౌక నిర్మాణం పూర్తి కావాలంటే మరో రూ.2,772 కోట్లు కావాలి. అయితే, సంస్థ దివాళా తీయడంతో నిర్మాణ భాగస్వాముల కోసం ఎదురు చూస్తోంది. లేదా ఎవరికైనా నౌకను అమ్మేయాలి అనుకుంటోంది. కానీ, దీనికోసం ఎవరూ ముందుకు రావడం లేదు. నౌకను అమ్మడమో లేక నిధులు సమకూర్చుకోవడమే చేయాలని చూస్తున్నా ఈ ప్రయత్నాలు ఫలిండచం లేదు. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే నౌకను ముక్కలుముక్కలు చేసి అమ్ముకోవడం తప్ప ఇంకో మార్గం లేదని కంపెనీ భావిస్తోంది. దీని ద్వారా నష్టాల నుంచి కొంతైనా బయటపడేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. ఎవరూ నౌకను కొనేందుకు ముందుకు రాకపోతే.. ప్రయాణానికి ముందే ఈ నౌక కొద్ది రోజుల్లోనే తుక్కు కింద మారిపోవడం ఖాయం.