Indian Air Force: యుద్ధ విమానాలతో ఒళ్లు జలధరించేలా భారత వాయుసేన విన్యాసాలు.. ఆకట్టుకుంటున్న వీడియో

భారత వైమానిక దళం సత్తాని ప్రపంచానికి చాటి చెప్పేలా విన్యాసాలు నిర్వహిస్తుంది ఎయిర్ ఫోర్స్. తాజాగా ఒడిశాలోని పూరి పట్టణంలో, ‘సూర్య కిరణ్’ బృంద ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శన వీక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది.

Indian Air Force: యుద్ధ విమానాలతో ఒళ్లు జలధరించేలా భారత వాయుసేన విన్యాసాలు.. ఆకట్టుకుంటున్న వీడియో

Indian Air Force: భారత వాయుసేనకు చెందిన ఏరోబాటిక్స్ ప్రదర్శన విభాగం ‘సూర్య కిరణ్’. ఇది మన వాయుసేనకు చెందిన 52వ స్క్వాడ్రన్. దీనిలోని ఒక బృందం తొమ్మిది యుద్ధ విమానాల్ని కలిగి ఉంటుంది.

Beer Bottles Video: బుల్డోజర్‌తో లక్ష బీర్ బాటిళ్లు ధ్వంసం చేసిన ఎక్సైజ్ శాఖ.. ఎందుకో తెలుసా!

1996లో ఏర్పాటైన ‘సూర్య కిరణ్’ బృందాలు భారత వాయుసేన సత్తాను చాటిచెప్పేలా యుద్ధ విమానాలతో ప్రదర్శనలు కూడా నిర్వహిస్తుంటాయి. ఇటీవల ఒడిశాలోని పూరి పట్టణంలో ఒక ఎయిర్ షో జరిగింది. ఇందులో భారత యుద్ధ విమానాలతో ‘సూర్య కిరణ్ ఏరోబాటిక్ టీమ్ (స్కాట్)’ నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శన వీక్షకుల్ని ఆకట్టుకుంది. గాలిలో విమానాలతో చేసిన కొన్ని విన్యాసాలు ఒళ్లు జలధరించేలా ఉన్నాయి.

Biggest Cruise Ship: ప్రయాణానికి ముందే ముక్కలుముక్కలు కానున్న రూ.8 వేల కోట్ల నౌక.. ఎందుకో తెలుసా!

మన వైమానిక సత్తాను ప్రపంచానికి చాటి చెప్పడమే కాకుండా, యువతలో దేశభక్తిని నింపేందుకు కూడా ఈ విన్యాసాలు ఉపయోగపడతాయని సైనికాధికారులు అంటున్నారు. అందుకే నిత్యం భారత వైమానికి దళం ఇలాంటి విన్యాస ప్రదర్శనల్ని నిర్వహిస్తుంటుంది.