Home » Author »Narender Thiru
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, సొంత పార్టీ స్థాపించిన పంజాబ్ సీనియర్ నేత అమరీందర్ సింగ్ త్వరలో బీజేపీలో చేరనున్నారు. ఈ నెల 19న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఆయన బీజేపీలో చేరుతారు.
గ్వాటెమాలాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. ఈ వేడుకల సందర్భంగా నిర్వహించిన ఒక కార్యక్రమానికి భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. దీంతో తొక్కిసలాట జరిగి 9 మంది మరణించారు.
గాల్లో ఎగిరే బైకును తయారు చేసింది అమెరికాకు చెందిన ఒక సంస్థ. ఇటీవల ఈ బైక్‌ను అమెరికాలో జరిగిన ఒక ఆటో షోలో ప్రదర్శించారు. వచ్చే ఏడాది అమెరికాలో అందుబాటులోకి వస్తుంది. దీని ధర మాత్రం చాలా ఎక్కువ.
అనంతపురంలో నకిలీ బ్యాంక్ ముఠా గుట్టు రట్టైంది. ఒకే కుటుంబానికి చెందిన కొందరు వ్యక్తులు కలిసి ఒక ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను స్థాపించి మోసానికి పాల్పడ్డారు. డిపాజిటర్ల నుంచి లక్షల్లో వసూలు చేశారు.
ఊరంతటికి షాక్ ఇచ్చింది తమిళనాడు వక్ఫ్ బోర్డు. ఊరు.. ఊరంతా తమదే అంటోంది. గ్రామంలో ఉన్న మొత్తం భూమి తమ బోర్డుకే చెందుతుందని డాక్యుమెంట్లు అందజేసింది. దీంతో అవసరానికి భూమి అమ్ముకుందామనుకున్న గ్రామ రైతుతోపాటు, ఊళ్లో వాళ్లంతా విస్మయం వ్యక్తం చేస
టెన్నిస్ దిగ్గజ ఆటగాడు, ప్రపంచ ఆల్‌టైమ్ టెన్నిస్ గ్రేట్ ప్లేయర్లలో ఒకరైన రోజర్ ఫెదరర్ టెన్నిస్‌కు వీడ్కోలు ప్రకటించాడు. ఈ మేరకు శనివారం సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశాడు.
జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచార ఘటన మరువక ముందే హైదరాబాద్ మహా నగరంలో మరో దారుణం జరిగింది. పదమూడేళ్ల బాలికను కిడ్నాప్ చేసిన యువకులు ఆమెపై రెండు రోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
వరుస హత్యలతో సంచలనం సృష్టించిన సీరియల్ కిల్లర్‌ను చూసి తోటి ఖైదీలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఈ సీరియల్ కిల్లర్ విషయంలో అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే ఒంటరిగా సెల్లో ఉంచారు.
మధ్యప్రదేశ్‌లో ఒక జంటపై ఎలుగుబంటి దాడి చేసి చంపేసింది. అంతేకాదు... వారి శరీరంలోని చాలా భాగాల్ని తినేసింది. ఘటనపై సమాచారం అందుకున్న అటవీ శాఖాధికారులు అక్కడికి చేరుకుని ఎలుగుబంటిని పట్టుకునేందుకు ప్రయత్నించారు.
అమరావతి ప్రాంతంపై తనకు ఎలాంటి కోపం లేదన్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. రాజధాని అంశంపై ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా జగన్ మాట్లాడారు. మూడు రాజధానుల అవసరం గురించి ఆయన వివరించారు.
తల్లిదండ్రులు లేని పిల్లలను అనాథ అని పిలవడంలో ఎలాంటి తప్పు లేదని వ్యాఖ్యానించింది బాంబే హైకోర్టు. ‘అనాథ’ బదులు ‘స్వనాథ’ అని పిలిచేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన ఒక పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహమైన ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ కన్నా పెద్దదైన గ్రహ శకలం ఒకటి ఈ వారంలోనే భూమికి దగ్గరగా రానున్నట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. దీని పొడవు సుమారు 210 మీటర్లు ఉంటుందని అంచనా. దీని వేగం 62 వేల కిలోమీటర్లకుపైనే ఉంది.
తెలంగాణ నూతన సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవోను విడుదల చేయనుంది.
జమ్మూలో వరుసగా రెండో రోజు బస్సు ప్రమాదం జరిగింది. బుధవారం బస్సు లోయలో పడ్డ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, గురువారం కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు.
తమిళనాడు వాసి కువైట్‌లో దారుణ హత్యకు గురయ్యాడు. యజమాని చెప్పినట్లుగా ఒంటెల సంరక్షణ బాధ్యత తీసుకోలేదని, తమిళనాడు వాసిని యజమాని హత్య చేశాడు. అత్యంత క్రూరంగా హింసించి చంపాడు.
రోడ్లు బాగోలేకపోతే వాటిని బాగు చేయాలని కోరుతూ కొందరు వినూత్నంగా నిరసన చేపడుతుంటారు. తాజాగా కర్ణాటకలోని ఉడుపిలో ఒక ఉద్యమకారుడు రోడ్లపై పొర్లు దండాలతో నిరసన చేపట్టాడు.
బెంగాల్ టీచర్ల రిక్రూట్మెంట్ స్కాంలో అరెస్టైన మాజీ మంత్రి పార్థా ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ కోర్టు విచారణలో కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ప్రశాంతమైన జీవితం గడపాలి అనుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు.
బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామికి ఢిల్లీ హై కోర్టు షాక్ ఇచ్చింది. ఢిల్లీలో ఆయన నివాసం ఉంటున్న అధికారిక బంగ్లాను ఆరు వారాల్లోగా ఖాళీ చేయాలని ఆదేశించింది. ప్రైవేటు బంగ్లాలో కూడా సెక్యూరిటీ ఉంటుందని సూచించింది.
ఒక బులియన్ కంపెనీకి సంబంధించిన ప్రైవేటు లాకర్లపై ఈడీ జరిపిన దాడిలో 91.5 కేజీల బంగారం బయటపడింది. మరో 340 కేజీల వెండిని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం బంగారం, వెండి విలువ దాదాపు రూ.47 కోట్లకుపైనే ఉంటుందని అంచనా.
కొద్ది రోజులుగా ఆ ఊరిని వింత శబ్దాలు భయపెడుతున్నాయి. భూగర్భం నుంచి వినిపిస్తున్న అంతుచిక్కని శబ్దాలతో ఊరి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. తమ ఊళ్లో ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.