Subramanian Swamy: సుబ్రహ్మణ్య స్వామికి ఢిల్లీ హై కోర్టు షాక్.. ఆరు వారాల్లోగా ఇల్లు ఖాళీ చేయాలని ఆదేశం
బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామికి ఢిల్లీ హై కోర్టు షాక్ ఇచ్చింది. ఢిల్లీలో ఆయన నివాసం ఉంటున్న అధికారిక బంగ్లాను ఆరు వారాల్లోగా ఖాళీ చేయాలని ఆదేశించింది. ప్రైవేటు బంగ్లాలో కూడా సెక్యూరిటీ ఉంటుందని సూచించింది.

Subramanian Swamy
Subramanian Swamy: బీజేపీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామికి ఢిల్లీ హై కోర్టు షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో నివాసం ఉంటున్న ఇంటిని ఆరు వారాల్లోగా ఖాళీ చేయాలని ఆదేశించింది. సుబ్రహ్మణ్య స్వామి భద్రతకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో 2016లో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని లుట్యెన్స్ బంగ్లా జోన్‌లో ఒక ఇంటిని కేటాయించింది.
AP Assembly Session: రేపటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. రాజధాని అంశంపైనే ప్రధాన చర్చ
అలాగే జడ్ కేటగిరి భద్రత కల్పించింది. అయితే, ఆయన రాజ్యసభ పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్‌లో పూర్తైంది. దీంతో ఆయన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉన్నప్పటికీ ఖాళీ చేయలేదు. అయితే, ఆ ఇంటిని తిరిగి కేటాయించాలని కోరుతూ సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన భద్రతకు ముప్పు పొంచి ఉన్నందును ప్రభుత్వం జడ్ కేటగిరీ సెక్యూరిటీతోపాటు, ఆ ఇంటిని కేటాయించిందని, తన ప్రైవేటు బంగ్లాలో ఉంటే అంత భద్రత ఉండదని, అందువల్ల అదే ఇంట్లో ఉండేందుకు అనుమతించాలని ఆయన కోర్టును కోరారు. దీనిపై జస్టిస్ యశ్వంత్ వర్మతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
Sourav Ganguly, Jay Shah: జై షా, సౌరవ్ గంగూలీకి సుప్రీంకోర్టు ఊరట.. పదవుల్లో తిరిగి కొనసాగేలా తీర్పు
‘‘ప్రభుత్వం భద్రత కల్పించాల్సి ఉన్నప్పటికీ, నివాసం ఏర్పాటు చేయడం తప్పనిసరి కాదు. ప్రైవేటు లేదా సొంత నివాసంలో కూడా అదే భద్రత ఉంటుంది. అందువల్ల ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను ఆరు వారాల్లోగా ఖాళీ చేయాలి’’ అని హైకోర్టు ఆదేశించింది. దీంతో సుబ్రహ్మణ్య స్వామి ప్రభుత్వం తనకు కేటాయించిన ఇంటిని ఆరు వారాల్లోగా ఖాళీ చేయాల్సి ఉంటుంది.