AP Assembly Session: రేపటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. రాజధాని అంశంపైనే ప్రధాన చర్చ

ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా రాజధాని అంశం, పోలవరం వంటివి ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. మూడు రాజధానులపై సీఎం జగన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.

AP Assembly Session: రేపటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. రాజధాని అంశంపైనే ప్రధాన చర్చ

AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం (సెప్టెంబర్ 15) నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసన మండలి అధ్యక్షుడు కొయ్యే మోషేన్ రాజు బుధవారం పరిశీలించారు.

Congress Collapses In Goa: గోవాలో కాంగ్రెస్ పార్టీకి షాక్.. బీజేపీలో చేరిన 8 మంది ఎమ్మెల్యేలు

ఈ సమావేశాల్లో కీలక అంశాలపై వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా రాజధాని అంశం, పోలవరం వంటివి చర్చకు వచ్చే అవకాశం ఉంది. సభ ప్రారంభమైన మొదటి రోజు మూడు రాజధానుల అంశంపై చర్చిస్తారు. అసెంబ్లీలో మూడు రాజధానులపై సీఎం జగన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇప్పటికే మూడు రాజధానులు రెఫరెండంగా ఎన్నికలకు వెళ్తామని వైసీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అంశంతోపాటు పోలవరం పనుల పురోగతి, డయాఫ్రం వాల్ డ్యామేజీ వంటి అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ సమావేశాల్లో అధికార వైసీపీని ప్రజా సమస్యల విషయంలో ఇరుకున పెట్టాలని టీడీపీ భావిస్తోంది. ఈ సభలో 15 అంశాలు లేవనెత్తాలని టీడీఎల్పీ నిర్ణయించింది.

Air India Flight: మస్కట్‌లో ఎయిరిండియా విమానంలో పొగలు.. ప్రయాణికులు సురక్షితం

ఈ సందర్భంగా అమరావతి రాజధాని అంశంపై చర్చించనుంది. అమరావతిలో అక్రమాలంటూ సీఐడీ చేపట్టిన తాజా అరెస్టులపై కూడా చర్చించాలని భావిస్తోంది. పాదయాత్ర సమయంలో రైతులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని కూడా టీడీపీ విమర్శిస్తోంది. భారీ వర్షాలు, వరదలకు పంట నష్టం, టిడ్కో ఇళ్ల పంపిణీ, గృహ నిర్మాణం, దళితులు, మైనారిటీలపై దాడులు, పోలవరం విషయంలో నిర్లక్ష్యం, బాక్సైట్ అక్రమ మైనింగ్, మద్యం కుంభకోణం, శాంతి భద్రతలపై కూడా అసెంబ్లీలో చర్చించాలని టీడీపీ నిర్ణయించింది.