Health Tips: పండ్లు ఆరోగ్యానికి మంచివే.. కానీ, ఈ పండ్లను అస్సలు కలిపి తినకండి.. విషయంగా మారుతుంది జాగ్రత్త
పండ్లు అనేవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్నది అందరికీ తెలిసిన విషయమే(Health Tips). వాటిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్,

Health tips on which fruits should not be eaten together
Health Tips: పండ్లు అనేవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్నది అందరికీ తెలిసిన విషయమే. వాటిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల ఇవి శరీరానికి శక్తిని, ఆరోగ్యాన్ని అందిస్తాయి. అయితే, మనలో చాలా మంది ఫ్రూట్ సాలాడ్ పేరుతో కొన్ని పండ్లను కలిపి తింటూ ఉంటారు. ఇది కూడా ఆరోగ్యానికి మంచి పుషకాలను అందిస్తుంది. కానీ, పరిశోధనల ప్రకారం కొన్ని రకాల పండ్లను కలిపి తినడం వల్ల అది(Health Tips) విషంగా మారే ప్రమాదం ఉందట. మరి ఆ పండ్లు ఏంటి? ఎందకు అలా అవుతుంది? అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
పండ్లను కలిపి తినకూడదనే విషయానికి మూడు ముఖ్య కారణాలు:
విభిన్నమైన జీర్ణ వ్యవస్థ అవసరం:
ప్రతి పండు జీర్ణానికి అవసరమైన ఎన్జైములు, టైమింగ్స్ భిన్నంగా ఉంటాయి. కొన్ని పండ్లు వేగంగా జీర్ణమవుతాయి, మరికొన్ని ఆలస్యంగా జీర్ణమవుతాయి. కాబట్టి, ఈ రెండు రకాల పండ్లను కలిపితే జీర్ణ ప్రక్రియలో గందరగోళం ఏర్పడి అజీర్తి, అసిడిటీ లాంటి సమస్యలు కలుగవచ్చు.
పోషక పదార్థాల పరస్పర వ్యతిరేకత:
కొన్ని పండ్లలోని పోషకాలు మరొక పండ్లతో కలిసినప్పుడు దుష్ప్రభావం కలిగించవచ్చు. ఉదాహరణకు పాలు, పాపాయ కలయిక శరీరానికి హానికరమైన టాక్సిన్‌లను విడుదల చేస్తుంది. దీనివల్ల ఆలర్జీ, చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆయుర్వేదం ప్రకారం, వ్యతిరేక స్వభావాలున్న ఆహార పదార్థాలను కలిపితే పేగు సమస్యలు పెరగవచ్చు.
కలిపి తినకూడని పండ్లు:
- పాలు + అరటిపండు: ఆయుర్వేదం ప్రకారం ఇవి రెండు విరుద్ధమైన ఆహారాలు. వీటిని కలిపి తినడం వల్ల మలబద్ధకం, నిద్ర మత్తు, చర్మ సమస్యలు రావచ్చు.
- పాలు + పాపాయ: ఈ రెండును కలిపి తినడం వల్ల శరీరంలో హానికరమైన టాక్సిన్‌లు విడుదల చేస్తాయి. దీనివల్ల విటిలిగో (చర్మంపై తెల్లని మచ్చలు) ప్రమాదం రావచ్చు.
- నిమ్మ + బనానా: ఈ రెండు రసాయన వ్యతిరేకత గల పండ్లు. అందుకే వీటిని తినడం వల్ల పేగుల సమస్యలు, చర్మ అలర్జీలు రావచ్చు.
- పుచ్చకాయ + ఇతర పండ్లు: పుచ్చకాయ ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది. కానీ, పుచ్చకాయను మిగతా పండ్లతో కలిపి తినడం వల్ల జీర్ణక్రియకు అడ్డుపడుతుంది. దీనివల్ల వాంతులు, వాయువు వంటి సమస్యలు రావచ్చు.
సురక్షితమైన ఫల మిశ్రమాలు:
- బెర్రీలు కలిపి తినడం: స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్‌బెర్రీలు కలిపి తినవచ్చు.
- అరటి + ఆపిల్: ఇవి రెండు కలిపి తినడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు రావు.
- నారింజ + మోసంబి: ఒకే టైపు సిట్రస్ ఫలాలు కావడంతో సమస్యలు వచ్చే అవకాశం తక్కువ.
Diabetes: డయాబెటీస్ పేషేంట్స్ మీకోసమే.. పవర్ ఫుల్ ఎనర్జీ డ్రింక్.. రోజూ తాగితే షుగర్ మొత్తం మాయం
ఎప్పుడు తినాలి?
- పండ్లను ఖాళీ కడుపుతో ఉదయం తీసుకోవడం మంచిది.
- భోజనం తర్వాత వెంటనే పండ్లు తినడం మానాలి. కనీసం మూడు గంటల గ్యాప్ ఉండాలి.
అన్ని పండ్లు ఆరోగ్యానికి మంచివే, కానీ వాటిని కలిపి తినే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన సమాచారం లేకుండా కలిపి తినడం శరీరానికి హానికరంగా మారవచ్చు.