Home » Author »Narender Thiru
‘కూలింగ్ ఆఫ్ పీరియడ్’ను రద్దు చేస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఆమోదించింది. దీని ప్రకారం.. జై షా, సౌరవ్ గంగూలీ తమ పదవుల్లో తిరిగి కొనసాగవచ్చు. వరుసగా రెండో టర్మ్ పదవుల్లో ఉండొచ్చు.
రాజస్థాన్‌లో దారుణ ఘటన జరిగింది. ఒక వ్యక్తి తన కూతురుకు రెండో పెళ్లి చేసినందుకు, ఆమె మొదటి భర్త బంధువులు ఆ తండ్రి చెవులు, ముక్కు కోసేశారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా రాజధాని అంశం, పోలవరం వంటివి ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. మూడు రాజధానులపై సీఎం జగన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు.
మస్కట్ ఎయిర్‌పోర్టులో ఎయిరిండియా విమానం నుంచి పొగలు రావడంతో అత్యవసరంగా ప్రయాణికుల్ని దింపేశారు. ఎయిర్‌పోర్టు రన్‌వేపై విమానం బయల్దేరేందుకు సిద్ధమవుతుండగా ఈ ఘటన జరిగింది.
పాక్ నుంచి దేశానికి అక్రమంగా సరఫరా అవుతున్న డ్రగ్స్‌ను భారత భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. బుధవారం పట్టుకున్న పాక్ బోటు నుంచి రూ.200 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
బ్రిటన్‌లో జరగబోయే క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలకు భారత్ తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నారు. ఈ అంత్యక్రియలకు బ్రిటన్ అధికారికంగా భారత్‌కు ఆహ్వానం పంపింది.
జమ్ము-కాశ్మీర్, పూంఛ్ జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది. ఒక బస్సు లోయలో పడిపోవడంతో 12 మంది ప్రయాణికులు మరణించారు. మరో 25 మంది గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
వైఎస్ షర్మిలకు, టీఆర్ఎస్ నేతలకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టీఆర్ఎస్ నేతలపై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై స్పీకర్‌కు ఫిర్యాదు చేయడం చిన్న పిల్లల చర్యగా అభివర్ణించారు.
గోవా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్‌కు చెందిన 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోయారు. బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు గోవా ముఖ్యమంత్రి సమక్షంలో బీజేపీలో చేరారు.
చైనా నుంచి అప్పులు తీసుకున్న దేశాలు ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లు ఫోర్బ్స్ సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా పాకిస్తాన్, శ్రీలంక, మాల్దీవ్స్ వంటి దేశాలు రుణాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాయి.
ఒక ప్రభుత్వ పాఠశాలలోకి ఆయుధాలతో ప్రవేశించిన కొందరు గూండాలు అక్కడ చదువుకుంటున్న అమ్మాయిలను బెదిరించారు. తమతో ఫ్రెండ్షిప్ చేయాలని.. లేకుంటే కిడ్నాప్ చేస్తామని బెదిరించారు. బాధిత విద్యార్థినిలు తొమ్మిదో తరగతి చదువుతున్నారు.
తెలంగాణలో ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి తాజాగా టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 883 ఇంజనీరింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
ఆమ్ ఆద్మీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్‌ను తన ఇంటికి డిన్నర్‌కు ఆహ్వానించాడు ఒక ఆటో డ్రైవర్. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఆటో డ్రైవర్లతో జరిగిన సమావేశంలో ఈ సన్నివేశం చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్ ఆహ్వానాన్ని కేజ్రీవాల్ అంగీకరించాడు.
అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. నలుగు స్టాండ్ బై ప్లేయర్లకు అవకాశం కల్పించింది. అలాగే బుమ్రాతోపాటు, హర్షల్ పటేల్‌కు తిరిగి జట్టులో స్థానం కల్పించింది.
టీఆర్ఎస్ మహిళా నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కరోనా నిర్ధరణ అయింది. ఈ మేరకు ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ విషయం వెల్లడించారు.
వరుసగా దాడులు చేస్తోన్న ఈడీ దేశవ్యాప్తంగా కోట్లాది రూపాయల నగదును, నగల్ని స్వాధీనం చేసుకుంటోంది. మరి ఆ డబ్బు, నగలు, ఆస్తిని ఈడీ ఏం చేస్తుందో తెలుసా?
కరెంట్ సరఫరా లేకపోతే ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు చికిత్స అందించేందుకు అత్యవసర ఏర్పాట్లు కూడా ఉండటం లేదు. దీనికి నిదర్శనం తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ఘటనే. ఆస్పత్రిలో కరెంటు లేకపోవడంతో, మొబైల్ ఫోన్ల వెలుతురులోనే డాక్టర్లు చికిత్స అంద�
ఒక ప్రభుత్వంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అధికారిపై ప్రధాన కార్యదర్శి ఎలా చర్యలు తీసుకుంటారో తెలపాలని ప్రశ్నించింది ఢిల్లీ హైకోర్టు. రతజ్ కుమార్ అనే ఐఏఎస్‌పై వచ్చిన అవినీతి ఆరోపణల కేసు విషయంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
ఒక రోబోను సీఈవోగా నియమించుకుంది ఒక చైనా కంపెనీ. మిస్ టాంగ్ యు అనే రోబోను తమ కంపెనీ రొటేషనల్ సీఈవోగా నియమించుకున్నట్లు ‘ఫ్యుజియన్ నెట్ డ్రాగన్ వెబ్ సాఫ్ట్’ అనే చైనా కంపెనీ ప్రకటించింది.
అయోధ్యలో నిర్మిస్తున్న శ్రీ రామ దేవాలయానికి రూ.1,800 కోట్ల వ్యయం కావొచ్చని అంచనా వేసింది శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. వచ్చే ఏడాది డిసెంబర్‌కల్లా దేవాలయ నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు.