Kalvakuntla Kavitha: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కోవిడ్ పాజిటివ్

టీఆర్ఎస్ మహిళా నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కరోనా నిర్ధరణ అయింది. ఈ మేరకు ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ విషయం వెల్లడించారు.

Kalvakuntla Kavitha: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కోవిడ్ పాజిటివ్

Updated On : September 12, 2022 / 5:52 PM IST

Kalvakuntla Kavitha: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోవిడ్ బారిన పడ్డారు. ఆమె తనకు కోవిడ్ సోకినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. సోమవారం సాయంత్రం ఈ మేరకు ప్రకటన చేశారు. కవిత గత రెండు ‌మూడు రోజులుగా స్వల్ప దగ్గు వంటి కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నారు.

iOS 16 Update: నేటి నుంచే ఐఓఎస్ 16 వెర్షన్.. ఏయే ఫోన్లు అప్‌డేట్ చేసుకోవచ్చో తెలుసా!

దీంతో పరీక్షలు నిర్వహించగా కరోనా నిర్దారణ అయింది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా తనను‌ కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని, ఐసోలేషన్‌లో ఉండాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. అంతేకాదు కొన్ని రోజుల పాటు హోం ‌ఐసోలేషన్ లో ఉండనున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కవిత సోదరుడు కేటీఆర్ కూడా ఇటీవలే కోవిడ్ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే.