iOS 16 Update: నేటి నుంచే ఐఓఎస్ 16 వెర్షన్.. ఏయే ఫోన్లు అప్‌డేట్ చేసుకోవచ్చో తెలుసా!

ఐఓఎస్ 16 అప్‌డేట్‌ ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయంలోపు అందుబాటులో ఉంటుంది. ఐఫోన్స్ 8, ఆపై మోడల్స్ అన్నింటికీ ఈ అప్‌డేట్ ఉంటుంది. ఐఫోన్ ఎస్ఈ 2020, ఎస్ఈ 2022 మోడల్ ఫోన్లకు కూడా ఈ అప్‌డేట్ వర్తిస్తుంది.

iOS 16 Update: నేటి నుంచే ఐఓఎస్ 16 వెర్షన్.. ఏయే ఫోన్లు అప్‌డేట్ చేసుకోవచ్చో తెలుసా!

iOS 16 Update: ఐఫోన్ యూజర్స్‌కు గుడ్ న్యూస్. ఐఓఎస్ 16 (ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్) ఈ రోజు నుంచే అందుబాటులోకి రానుంది. ఈ రోజు రాత్రి లేదా రేపు తెల్లవారుఝాముకల్లా ఐఓఎస్ 16 అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.

BiggBoss 6 : బిగ్‌బాస్ లో ఇదే మొదటిసారి.. మొదటివారం ఎలిమినేషన్ క్యాన్సిల్.. హమ్మయ్య అనుకున్న కంటెస్టెంట్స్..

ఇంతకుముందు బీటా వెర్షన్, టెస్టింగ్ మోడ్‌లో అందుబాటులో ఉన్న ఐఓఎస్ 16 ఇకపై పూర్తి స్థాయిలో అధికారికంగా అందుబాటులోకి రానుంది. ఐఫోన్ యూజర్స్ తమ ఐఫోన్ల ఓఎస్‌ను అప్‌డేట్ చేసుకుని కొత్త ఫీచర్స్ ఎంజాయ్ చేయొచ్చు. ఐఫోన్స్ 8, ఆపై మోడల్స్ అన్నింటికీ ఈ అప్‌డేట్ ఉంటుంది. యాపిల్ తీసుకొచ్చిన బడ్జెట్ ఐఫోన్స్ అయిన ఐఫోన్ ఎస్ఈ 2020, ఎస్ఈ 2022 మోడల్ ఫోన్లకు కూడా ఈ అప్‌డేట్ వర్తిస్తుంది. ఈ అప్‌డేట్ విషయంలో యాపిల్ కచ్చితమైన టైమ్ వెల్లడించనప్పటికీ, మన కాలమానం ప్రకారం రాత్రి పది తర్వాత ఎప్పుడైనా అప్‌డేట్ రావొచ్చు. కొత్తగా విడుదలవుతున్న ఐఫోన్ 14 మోడల్ ఫోన్లకు అప్‌డేట్ అవసరం లేదు.

CM KCR : ఆర్టీసీని అమ్మేయాలని కేంద్రం ఒత్తిడి చేస్తోంది .. అమ్మేసిన రాష్ట్రానికి రూ.1000కోట్లు ఇస్తామని ఆఫర్లు ఇస్తోంది : కేసీఆర్

ఎందుకంటే ఈ ఫోన్లు ఐఓఎస్ 16 వెర్షన్‌తోనే వస్తున్నాయి. ఐఫోన్ యూజర్లు తమ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి, జనరల్ సెక్షన్‌పై క్లిక్ చేస్తే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అని కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి ఫోన్ అప్‌డేట్ చేసుకోవచ్చు. కొత్త అప్‌డేట్‌లో లాక్ స్క్రీన్‌లో మార్పులు చేశారు. లాక్ స్క్రీన్‌పై లాంగ్ ప్రెస్ చేసి వాల్ పేపర్ మార్చుకోవచ్చు. కెమెరా యాప్ కూడా అప్‌డేట్‌ చేసింది. ఇలాంటి మరెన్నో ఇంట్రస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి కొత్త వెర్షన్‌లో.