CM KCR : ఆర్టీసీని అమ్మేయాలని కేంద్రం ఒత్తిడి చేస్తోంది .. అమ్మేసిన రాష్ట్రానికి రూ.1000కోట్లు ఇస్తామని ఆఫర్లు ఇస్తోంది : కేసీఆర్

ఆర్టీసీని అమ్మేయాలని కేంద్రం లేఖలు రాస్తోందని.. అమ్మేసిన రాష్ట్రానికి రూ.1000కోట్లు ఇస్తామని ఆఫర్లు ఇస్తోంది అంటూ కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు.

CM KCR : ఆర్టీసీని అమ్మేయాలని కేంద్రం ఒత్తిడి చేస్తోంది .. అమ్మేసిన రాష్ట్రానికి రూ.1000కోట్లు ఇస్తామని ఆఫర్లు ఇస్తోంది : కేసీఆర్

CM KCR criticizes BJP government in Telangana assembly meetings

CM KCR IN Assembly : మామూలుగానే కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగ మండిపడే సీఎం కేసీఆర్ మరోసారి అసెంబ్లీ వేదికంగా కేంద్రం ప్రభుత్వంపై ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సభలో కేంద్ర విద్యుత్ బిల్లుపై తెలంగణ అసెంబ్లీలో చర్చ కొనసాగుతున్న క్రమంలో సీఎం కేసీఆర్ బీజేపీ సర్కార్ పై తనదైన శైలిలో విమర్శలు సంధించారు. పలు ఆరోపణలు చేశారు. ఆర్టీసీని అమ్మేయని కేంద్రం లేఖలు రాస్తోందని..ముందుగా ఎవరు అమ్మేస్తారో ఆ రాష్ట్రానికి కేంద్రం రూ.1000 కోట్లు ఇస్తామని ఆఫర్లు ఇస్తోంది అంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు సంధించారు కేసీఆర్.

విద్యుత్‌ సంస్కరణలపై జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా కేంద్రం విధానాలను ఎండగట్టారు కేసీఆర్. ‘మీటర్‌ పెట్టకుండా విద్యుత్‌ కనెన్షన్‌ ఇవ్వొద్దని కేంద్రం తీసుకువచ్చిన గెజిట్‌లోనే ఉన్నదని కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లుగా మీటర్లు పెడితే తెలంగాణలో 98 లక్షల కుటుంబాలు నష్టపోతాయని వెల్లడించారు. ఇటువంటి అర్థం పర్థం లేని విధానాలతో బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ..విద్యుత్ రంగాలను నాశనం చేస్తోందని ఇటువంటి నిర్ణయాలతో వ్యవసాయ..విద్యుత్ రంగాలను నాశనం చేసేంత వరకు నిద్రపోయేలా లేదంటూ దుయ్యబట్టారు.

విద్యుత్ వినియోగంలో 140 దేశాలను సర్వే చేస్తే మన దేశం ర్యాంక్ 104గా ఉందని సభకు తెలిపారు కేసీఆర్. విశ్వగురు అని చెప్పుకునే మోడీ నాయకత్వంలో జాతీయ తలసరి విద్యుత్ వినియోగం 290 యూనిట్లు మాత్రమేనని తెలిపారు కేసీఆర్. గెజిట్‌ నిన్నగాక మొన్న వచ్చింది. చట్టంలో లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌ శ్రీకాకుళంలో మీటర్‌ పెడితే రైతులంతా కుప్పలు పోసి.. ధర్నా చేశారు. ఈ ప్రమాదం తెలంగాణకు వస్తే సర్వనాశనం అవుతుందని అక్కడికి వెళ్లి వాస్తవాలు తెలుసుకున్నాం అని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో బీజేపీ ప్రజలకు ఎన్నో తియ్యని మాటలు చెప్పారు. ఫ్రీ కరెంటు ఇస్తామన్నరు. అక్కడ మీటర్లు పెడితే మూడు నాలుగు జిల్లాల్లో రైతులంతా కరెంటు ఆఫీసుల వద్ద మీటర్లు పోసి.. పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయని గుర్తు చేశారు సీఎం కేసీఆర్.